ETV Bharat / city

TDP COMPLAINT: 'కులం పేరుతో దూషించిన వైకాపా నేతలపై చర్యలు తీసుకోండి' - గుంటూరు తాజా వార్తలు

తెలుగుదేశం పార్టీ నాయకులపై దాడి చేసి, కులం పేరుతో దూషించిన వైకాపా నేతలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని తెదేపా నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యే నాగార్జున, పానుగంటి చైతన్యతోపాటు మరో 50 మందిపై గుంటూరు తూర్పు డీఎస్పీ సీతారామయ్యకి ఫిర్యాదు చేశారు.

tdp leaders complaint on ycp
వైకాపా నేతలపై తెదేపా ఫిర్యాదు
author img

By

Published : Aug 18, 2021, 4:21 PM IST

గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మృతురాలు రమ్య కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన తెదేపా నాయకులపై దాడి చేసి, కులం పేరుతో దూషించిన వైకాపా నేతలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని తెదేపా నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు గుంటూరు తూర్పు డీఎస్పీ సీతారామయ్యకి ఫిర్యాదు చేశారు. గుంటూరు గ్రామీణ ఎస్పీ విశాల్ గున్ని.. తన పట్ల దురుసుగా ప్రవర్తించాడని మాజీ మంత్రి నక్కా ఆనంద్​బాబు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యే నాగార్జున, పానుగంటి చైతన్య వాళ్ల అనుచరులు తనను కులం పేరుతో దూషించారని తెదేపా అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు పేర్కొన్నారు.

వైకాపా నేతలు అప్పిరెడ్డి, మేరుగ నాగార్జున, చైతన్య వారి అనుచరులు తనపై దాడి చేశారని తెదేపా రాష్ట్ర కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు. జీజీహెచ్ వద్ద వైకాపా నేతల ప్రవర్తన తమను తీవ్ర మనోవేధనకు గురిచేసిందని.. తక్షణమే వాళ్లపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి...: 'పన్నులు కడుతున్నా.. హక్కులు సాధించలేకపోతున్నాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.