గుంటూరు జిల్లాలో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. కొత్తగా 765 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లాలో మొత్తం 42వేల 808 పాజిటివ్ కేసులు నమోదు కాగా... కరోనా నుంచి కోలుకుని 32వేల730 మంది ఇంటికి చేరుకున్నారు.
జిల్లాలో ఇవాళ కొవిడ్ వైరస్ ప్రభావంతో 9మంది మృతిచెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 428 కి చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో గుంటూరు నగరంలోనే 79 ఉన్నాయి. ఇక మండలాల వారీగా నమోదైన కేసులు వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరి-19, ముప్పాళ్ల-11, ఫిరంగిపురం-12, పెదనందిపాడు-11, సత్తెనపల్లి-11, తాడేపల్లి-30, తడికొండ-19, తుళ్లూరు-12, వట్టిచెరుకూరు-16, మాచర్ల-27, చిలకలూరిపేట-39, నాదెండ్ల-23, నరసరావుపేట-130, రొంపిచర్ల-22, వినుకొండ-31, బాపట్ల-21, దుగ్గిరాల-19, కొల్లూరు-18, పొన్నూరు-26, రేపల్లె-39, తెనాలి-43 చొప్పున కేసులు నమోదయ్యాయి.
ఇదీ చదవండి: