ETV Bharat / city

'ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నాడు'

author img

By

Published : Aug 19, 2020, 3:28 PM IST

తన షాపుని ఆక్రమించుకునేందుకు దాయాదులు ప్రయత్నిస్తుంటే దానికి ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ సహకరిస్తున్నారని గుంటూరుకు చెందిన శివప్రసాద్ అనే వ్యాపారి ఆరోపిస్తున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని చెప్పారు.

maddali giri
maddali giri

గుంటూరులోని ఓ వస్త్ర దుకాణ వివాదంలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ తలదూర్చి తమని ఇబ్బందులకు గురి చేస్తున్నారని వ్యాపారి కొప్పురావూరి శివప్రసాద్ ఆరోపించారు. శంకర్ విలాస్ కూడలిలోని డి.బి.ఫ్యాషన్స్​కు సంబంధించి అన్నదమ్ముల కుమారుల మధ్య ఏడాది కాలంగా మనస్పర్థలు వచ్చాయి. ఈ క్రమంలో జులై 5వ తేదీన డి.బి. ఫ్యాషన్స్ దుకాణ తాళాలు పగలగొట్టి కోటిన్నర విలువైన సరకు, విలువైన డాక్యుమెంట్లు పట్టుకెళ్లినట్లు శివప్రసాద్ ఆరోపించారు. డి.బి.ఫ్యాషన్స్ బోర్డుపై అనన్య ఫ్యాషన్స్ అనే పేరు అతికించారని... దీనిపై అరండల్​పేట పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని ఆయన చెప్పారు. ఎస్పీ కార్యాలయంలో జరిగే గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ తమపై ఒత్తిడి తెస్తున్నారని... ఈ విషయంలో తామేం చేయలేమని పోలీసులు చెప్పినట్లు శివప్రసాద్ ఆరోపించారు. అందుకే దీనిపై తాను హైకోర్టులో కేసు వేయగా... ఎమ్మెల్యే గిరిధర్, రెవెన్యూ శాఖ అధికారులకు, పోలీసులకు కోర్టు నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. తన షాపుని ఆక్రమించుకునేందుకు దాయాదులు ప్రయత్నిస్తుంటే దానికి ఎమ్మెల్యే సహకరిస్తున్నారని శివప్రసాద్ ఆరోపిస్తున్నారు.

తనకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ బుధవారం దుకాణం వద్ద కాసేపు ఆందోళనకు దిగారు. కోర్టులో తనకు న్యాయం జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆ సమయంలో పోలీసులు అక్కడకు చేరుకుని ఈ వ్యవహారం కోర్టులో తేల్చుకోవాలని సూచించారు.

ఇదీ చదవండి

పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై సుప్రీం విచారణ వాయిదా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.