ETV Bharat / city

'వాలంటీర్లతో రేషన్​ ఇంటికే సరఫరా చెయ్యండి' - ఉచిత రేషన్ ఇంటికే పంపాలన్న లోకేేశ్

ప్రభుత్వం అందిస్తున్న ఉచిత రేషన్ కోసం చౌకధరల దుకాణం వద్ద ఎండలో నిలబడి ఓ వృద్ధురాలు మృతి చెందారని లోకేశ్ అన్నారు. ఆమె మరణం తనను కలచివేసిందన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా వాలంటీర్లతో రేషన్ ఇంటికి సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని లోకేశ్ కోరారు.

lokesh
నారా లోకేశ్
author img

By

Published : Mar 31, 2020, 6:12 AM IST

లోకేశ్ ట్వీట్

రేషన్ కోసం ఎండలో నిలబడి విశాఖపట్నం ద్వారకానగర్​లో వృద్ధురాలు షేక్ మేరబీ మృతిచెందారని... ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో ప్రజల్ని రేషన్ కోసం రోడ్లపై నిలబెట్టడం శ్రేయస్కరం కాదని ఆయన హితవు పలికారు. నెలకు రూ.400 కోట్ల ప్రజా ధనంతో నడుస్తున్న వాలంటీర్ వ్యవస్థతో రేషన్ ఇంటికి అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఇదీ చదవండి : కరోనాపై పాట పాడిన పవన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.