రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 6,923మందికి కరోనా సోకినట్లు వైద్యాధికారులు తెలిపారు. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,75,674కు చేరింది. వైరస్ కారణంగా మరో 45 మంది మరణించగా... మృతుల సంఖ్య 5,708కి ఎగబాకింది. కరోనా నుంచి 6,05,090మంది కోలుకున్నారు. ప్రస్తుతం 64,876మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
జిల్లాల వారీగా కరోనా కేసులు...
తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1,006మంది కరోనా బారిన పడ్డారు. పశ్చిమగోదావరి జిల్లాలో 929, ప్రకాశంలో 659, చిత్తూరులో 577 మందికి పాజిటివ్ సోకినట్లు వైద్యాధికారులు తెలిపారు. గుంటూరులో 535, నెల్లూరులో 506, శ్రీకాకుళంలో 503 కరోనా కేసులు వెలుగుచూశాయి. అనంతపురంలో 480, కడపలో 472, విజయనగరంలో 376, కృష్ణాలో 333, విశాఖలో 318, కర్నూలులో 229 కొవిడ్ కేసులు నమోదయ్యాయి.
జిల్లాలో వారీగా కరోనా మృతులు...
ప్రకాశం జిల్లాలో 8 మంది మరణించగా... కృష్ణాలో ఆరుగురు, గుంటూరులో ఐదుగురు మృతి చెందారు. ఉభయగోదావరి జిల్లాల్లో నలుగురు చొప్పున మృత్యువాతపడ్డారు. అనంతపురం, కడప, కర్నూలు, నెల్లూరు, విశాఖ జిల్లాల్లో ముగ్గురు చొప్పున... చిత్తూరులో ఇద్దరు, విజయనగరంలో వైరస్ కారణంగా ఒకరు కన్నుమూశారు.
ఇదీచదవండి.