రాష్ట్రంలో 2020-21 సంవత్సరానికి గాను 115 మిలియన్ కిలోల పొగాకు సాగు చేయాలని నిర్ణయించినట్లు పొగాకు బోర్డు అధ్యక్షులు యడ్లపాటి రఘునాథబాబు తెలిపారు. కరోనా నేపథ్యంలో అంతర్జాతీయంగా వాణిజ్య వ్యవహారాల్లో మార్పులు వచ్చాయని... అందుకే పొగాకు సాగు విస్తీర్ణం తగ్గించామని అన్నారు. గుంటూరులోని పొగాకు బోర్డు కార్యాలయంలో జరిగిన పాలక మండలి సమావేశంలో... 115 మిలియన్ కిలోల మేర ఉత్పత్తి అయ్యేలా సాగుకు సభ్యులు ఆమోదం తెలిపారు.
పొగాకు బోర్డు నూతన ఉపాధ్యక్షుడిగా జి.కొండారెడ్డిని ఎన్నుకున్నట్లు బోర్డు ఛైర్మన్ రఘునాథబాబు తెలిపారు. గతేడాది పండించిన పొగాకు కొనుగోళ్లు, ఎగుమతుల్లో కరోనా కారణంగా ఇబ్బందులు ఎదురైనట్లు తెలిపారు. అందుకే ఈసారి 20 మిలియన్ కిలోలను తగ్గించినట్లు వివరించారు. అంతర్జాతీయ స్థాయి నాణ్యతతో పొగాకు పండించేలా.. రైతులకు అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: