ETV Bharat / city

Police Weekly Off in ap: 'వీక్లీ ఆఫ్' నిర్ణయం​ త్వరలోనే పునరుద్ధరణ - హోంమంత్రి

Home Minister Sucharitha on Police Weekly Off: పోలీసుశాఖలో వీక్లీ ఆఫ్ నిర్ణయాన్ని త్వరలోనే పునరుద్ధరిస్తామని హోంమంత్రి మేకతోటి సుచరిత స్పష్టం చేశారు. పని ఒత్తిడి కారణంగానే నిర్ణయం అమల్లో కొంత జాప్యం జరిగిందని చెప్పారు. గుంటూరులో మాట్లాడిన ఆమె.. ప్రజలకు అందే సేవలను సులభతరం చేయటమే వైకాపా సర్కార్ లక్ష్యమని వెల్లడించారు.

AP Home Minister Sucharitha
Police Weekly Off in AP
author img

By

Published : Nov 30, 2021, 4:28 PM IST

Minister Sucharitha on Police Weekly Off: ప్రజలకు అందాల్సిన సేవలను సులభతరం చేయటమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. పట్టణాల్లో వంద ఇళ్లకో వాలంటీర్​.. సమీపంలోనే సచివాలయాలను ఏర్పాటు చేశామని చెప్పారు. గుంటూరు తూర్పు మండల తహస్దీలార్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఆమె.. మీడియాతో మాట్లాడారు. పోలీసులకు వారాంతపు సెలవుపై స్పందించిన మంత్రి.. పని ఒత్తిడి కారణంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమల్లో కొంత జాప్యం జరిగిందని చెప్పారు. సిబ్బంది కూడా స్వచ్ఛందంగా విధులు నిర్వర్తించారని చెప్పారు. వీక్లీ ఆఫ్​పై సీఎం జగన్ కూడా ఆదేశాలు ఇచ్చారని.. త్వరలోనే పునరుద్ధరణ చేస్తామని చెప్పారు. వారాంతపు సెలవును వారానికి ఒకరోజు లేదా.. నెలలో వరుసగా మూడు రోజులు తీసుకోవచ్చని వెల్లడించారు.

ఇదీ చదవండి

CJI Justice NV Ramana tributes to Dollar Seshadri: 'డాలర్ శేషాద్రి లేని తిరుమలను ఊహించలేకపోతున్నా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.