ETV Bharat / city

Farmers Protest Against Power Cut: వేళాపాళా లేని విద్యుత్ కోతలు...ఆందోళనలో రైతులు...

Farmers Protest Against Power Cut : ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి వచ్చే సమయంలో నష్టపోవాల్సి వస్తుందంటూ రైతులు ఆందోళనకు దిగారు. విద్యుత్ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి నెలకొందని దీనివల్ల పగలు, రాత్రి తేడా లేకుండా మోటార్ల వద్దే పడిగాపులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Farmers Protest Against Power Cuts
వేళాపాళా లేని విద్యుత్ కోతలు...ఆందోళనలో రైతులు...
author img

By

Published : Feb 5, 2022, 1:10 PM IST

Updated : Feb 5, 2022, 3:46 PM IST

Ananthapur Farmers Protest on Power Cut : అనంతపురం జిల్లా రొళ్ళ మండలంలోని బి.జి.హళ్ళి గ్రామ సబ్ స్టేషన్ వద్ద, అగలి మండల కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్ ముందు,మంగంపల్లి సబ్ స్టేషన్ వద్ద విద్యుత్ కోతలు ఆపాలని రోడ్లపై బైఠాయించి రైతులు నిరసన వ్యక్తం చేశారు. పంటలకు 9గంటల విద్యుత్ అందించాలని నినాదాలు చేశారు. విద్యుత్ కోతతో గ్రామాల్లో తాగునీటి సమస్య ఏర్పడిందన్నారు. రాత్రిళ్లు ఇళ్లలో విద్యుత్ సరఫరా లేక చీకటిలో పిల్లలు, పెద్దలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ కోతల సమస్యను పరిష్కరించాలని రైతులు ప్రభుత్వాన్ని కోరారు.ఫోన్ ద్వారా విద్యుత్ ఉన్నతాధికారులు మాట్లాడుతూ సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు అక్కడి నుంచి వెనుదిరిగారు.

ఇదీ చదవండి : Minister Balineni On Power Cut: రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఎక్కడున్నాయి ?: మంత్రి బాలినేని

Farmers Protest Against Power Cut : ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి వచ్చే సమయంలో నష్టపోవాల్సి వస్తుందంటూ రైతులు ఆందోళనకు దిగారు. ఇటీవల విద్యుత్ కోతలతో రైతులు ఆవేదన చెందుతున్నారు. మరో ఇరవై రోజుల్లో మొక్కజొన్న, వేరుశనగ పంటలు చేతికి వచ్చే సమయంలో విద్యుత్ కోతల కారణంగా పంట ఎండిపోతుందని ఆక్రోశించారు. తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పి ఇప్పుడు రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. విద్యుత్ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి నెలకొందని దీనివల్ల పగలు, రాత్రి తేడా లేకుండా మోటార్ల వద్దే పడిగాపులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పగలు కనీసం ఐదు గంటలు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని కోరారు. విద్యుత్ సమస్య పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. టీ నర్సాపురం మండలం తెడ్లం, లింగపాలెం మండలం రంగాపురం గ్రామంలో రైతులు రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

ఇదీ చదవండి : POSOCO Letter to AP: 'మీవల్ల జాతీయ విద్యుత్ గ్రిడ్‌కే ప్రమాదం'..రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ లేఖ

Last Updated : Feb 5, 2022, 3:46 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.