ETV Bharat / city

NUDE VIDEO CALLS: యువకుడిని బెదిరిస్తున్న యువతి... డబ్బులివ్వకుంటే.. - క్రైమ్ వార్తలు

ఫేస్​బుక్​లో యువకుడికి ఓ మాయలేడి ఫ్రెండ్​ రిక్వెస్ట్​ పంపింది. క్రమంగా ఛాటింగ్​ చేస్తూ.. ఓ రోజు యువతి తన దుస్తులను తొలగించి.. యువకుడిని అలాగే చేయాలంటూ సూచించింది. ఆ వీడియోలను అతడికి తెలియకుండానే రికార్డ్​ చేసింది. కొన్ని రోజుల తర్వాత.. డబ్బులివ్వకుంటే ఆ వీడియోలు సోషల్​ మీడియాలో పెడతానని బెదిరించింది.

NUDE VIDEO CALLS
NUDE VIDEO CALLS
author img

By

Published : Oct 14, 2021, 4:39 PM IST

ఫేస్‌బుక్‌లో ఓ యువకుడితో ఏర్పడిన పరిచయాన్ని అడ్డుగాపెట్టుకొని.. ఓ యువతి బెదిరింపులకు దిగింది. తాను కోరినంత డబ్బు ఇవ్వకుంటే.. అతడితో జరిపిన ఛాటింగ్‌లకు సంబంధించిన వీడియోలను సామాజిక మాధ్యమాల్లో ఉంచుతానంటూ హెచ్చరించింది. దీంతో యువకుడు హైదరాబాద్​ సీసీఎస్‌ పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసి బంజారాహిల్స్‌ పోలీసులకు బదిలీ చేశారు.

బంజారాహిల్స్‌ రోడ్‌ నంబరు 12లోని భోళానగర్‌లో నివసించే ఓ యువకుడు(32) ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్నాడు. ఈ ఏడాది జులైలో అతడి ఫేస్‌బుక్‌ ఖాతాకు సాక్షి వర్మ పేరుతో ఓ మహిళ ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపింది. దానికి ఆమోదం తెలిపిన అనంతరం వారి మధ్య జరిగిన ఛాటింగ్‌తో క్రమంగా స్నేహం పెరిగింది. ఆ క్రమంలో సదరు యువతి తన దుస్తులను తొలగించి.. యువకుడిని అలాగే చేయాలంటూ సూచించింది. దీంతో ఆమె చెప్పినట్లు చేయగా.. అతడికి తెలియకుండానే వీడియో రికార్డింగ్‌ చేసింది.

అనంతరం డబ్బులు ఇవ్వాలంటూ, క్రిప్టో కరెన్సీ రూపంలో సొమ్ము చెల్లించాలంటూ బెదిరించడం ప్రారంభించింది. యువతితోపాటు ఆమె బృందంలోని ఇతరులూ బెదిరింపులు తీవ్రతరం చేశారు.. అంతటితో ఆగకుండా సంబంధిత వీడియోలోని కొంత భాగాన్ని ఫేస్‌బుక్‌లోని యువకుడి స్నేహితుల్లో కొందరికి పంపారు. వారి నుంచి వచ్చే ఫోన్‌కాల్స్‌ యువకుడు ఎత్తకపోవడంతో మరో నంబరు నుంచి ఫోన్‌ చేస్తూ.. డబ్బు ఇవ్వకుంటే తాము రికార్డు చేసిన వీడియోలను సామాజిక మాధ్యమాలన్నింటిలోనూ అప్‌లోడ్‌ చేస్తామంటూ బెదిరించసాగారు. తీవ్ర ఒత్తిడికి లోనైన యువకుడు.. తనకు న్యాయం చేయాలంటూ సీసీఎస్‌ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన సీసీసీఎస్‌ పోలీసులు మంగళవారం బంజారాహిల్స్‌ పోలీసులకు బదిలీ చేయగా వారు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీచూడండి:

Maa elections 2021: 'సీసీ టీవీ వీడియోలు బయటపెట్టాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.