Vice President: ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న వివిధ ప్రాజెక్టుల పురోగతి గురించి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు వరుసగా మూడోరోజు పలువురు కేంద్రమంత్రులతో సమీక్షించారు. గురువారం ఆయన వాణిజ్య మంత్రి పీయూష్‌గోయల్, పెట్రోలియం, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్ పురి, పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డిలతో వేర్వేరుగా మాట్లాడారు.
పీయూష్‌గోయల్‌తో విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక కారిడార్ గురించి చర్చించారు. ఈ ప్రాజెక్టు పెట్టుబడులు, తయారీరంగ గమ్యస్థానంగా మారే అవకాశం ఉన్నందున ఇప్పటివరకు ఉన్న వాస్తవ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. హర్‌దీప్‌సింగ్ పురితో కాకినాడలో తలపెట్టిన పెట్రోకెమికల్ కాంప్లెక్స్ గురించి చర్చించారు. అలాగే వివిధ గృహనిర్మాణ పథకాలు, స్మార్ట్ సిటీలు, అమృత్ పథకాల అమలు తీరుగురించీ సమీక్షించారు. రాష్ట్రంలో టూరిజం సర్క్యూట్లు, హెరిటేజ్ సిటీల అభివృద్ధి గురించి కిషన్‌రెడ్డితో మాట్లాడారు. పెండింగ్ పనులు సాధ్యమైనంత వేగంగా పూర్తిచేయాలని ఉప రాష్ట్రపతి ముగ్గురు మంత్రులనూ కోరారు.
ఇవీ చదవండి: