ముంబయిలోని తలోజా జైలులో అనారోగ్యంతో బాధపడుతున్న ప్రజాకవి వరవరరావుకు కరోనా సోకింది. ఆయనకు వైరస్ సోకినట్లు వైద్యులు వెల్లడించారు. బీమా కొరేగావ్ కేసులో అరెస్టయి 22 నెలలుగా జైలులో ఉన్న వరవరరావును మే నెలలో జేజే ఆసుపత్రిలో చేర్చినప్పటికీ, చికిత్స పూర్తికాకముందే మళ్లీ జైలుకు పంపించారు.
అప్పటి నుంచి ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. దీంతో ఆయన ప్రాణానికి ముప్పు ఉందని, వెంటనే చికిత్స అందించాలని కుటుంబ సభ్యులు, పౌరహక్కుల నేతలు డిమాండ్ చేయడంతో జైలు అధికారులు ఆసుపత్రికి తరలించారు. తాజాగా చేసిన పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది.
ఇదీ చూడండి..