రేవంత్ రెడ్డితో తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంత రావు ఫిర్యాదు చేశారు. తెలంగాణలో పీసీసీ పదవి వెనకబడిన వర్గం నుంచి బీసీలకు కేటాయించాలని కాంగ్రెస్ హైకమాండ్‌కు తెలిపానని ఆయన పేర్కొన్నారు.
రేవంత్ రెడ్డికి పీసీసీ ఇవ్వకూడదని పార్టీ హైకమాండ్‌కు చెప్పానని వెల్లడించారు. దాంతో కొంతమంది రేవంత్ అనుచరులు తనకు ఫోన్ చేసి అంతు చూస్తామని బెదిరించారని తెలిపారు.
ఇదీ చూడండి : అభిమాని ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లో సోనూసూద్ సందడి