ఆన్లైన్ గేమింగ్ చట్టంలో మార్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌ను సవాల్ చేస్తూ జంగిల్ గేమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సీవోవో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీవోవోతో పాటు ఆ సంస్థ యాజమాన్యం మరో పిటిషన్ వేసింది. ఈ రెండు వ్యాజ్యాలపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 23వ తేదీకి వాయిదా వేసింది.
ఏపీ గేమింగ్ చట్టం 1974ను సవరించి రాష్ట్రంలో ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్‌లను నిషేధిస్తూ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. 2020 సెప్టెంబర్ 25న ఈ సవరణ ఆర్డినెన్స్‌కు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ చట్టం మేరకు ఆన్లైన్ గ్యాంబ్లింగ్, బెట్టింగ్ నిర్వహించే వారు శిక్షార్హులని ప్రభుత్వం పేర్కొంది.
ఇదీ చదవండి
'ఆ వెబ్‌సైట్లను బ్లాక్ చేయండి'... కేంద్ర మంత్రికి సీఎం జగన్ లేఖ