- Alluri: ఆ పోలీసు స్టేషన్‌పై దాడికి వందేళ్లు
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు.. తొలిసారిగా చింతపల్లి పోలీసు స్టేషన్‌పై దాడి చేసి నేటితో 100ఏళ్లు పూర్తి అయింది. తెల్లదొరలపై పోరాడేందుకు సంప్రదాయ విల్లంబులు సరిపోవని.. ఆధునిక ఆయుధ సామాగ్రి అవసరం అని తలచి చింతపల్లి పోలీసు స్టేషన్‌పై దాడి చేసి ఆయుధాలు సేకరించాడు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- బియ్యం కార్డులున్న ప్రభుత్వ ఉద్యోగుల ‘లెక్క’ తేల్చండి !
బియ్యం కార్డులున్న ప్రభుత్వ ఉద్యోగులపై పౌర సరఫరాలశాఖ దృష్టి పెట్టింది. సంబంధిత ఉద్యోగుల కార్డు రద్దు చేయడంతోపాటు క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దీంతో ఆ ప్రభుత్వోద్యోగులపై జిల్లా కలెక్టర్లు విచారణ ప్రారంభించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- FAKE CHALLANS: ఆ విధానాన్ని ఎందుకు వదిలేశారు?
రాష్ట్రంలో సబ్ రిజిస్ట్రార్ల కార్యాలయాల్లో రీకన్సలేషన్ (పునఃపరిశీలన) ఎందుకు చేయడం లేదన్న ప్రశ్న తలెత్తుతోంది. ఈ నకిలీ చలాన్లతో రూ.5.85 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- raksha bandhan: రక్షాబంధన్‌కి మరోపేరు ‘జయసూత్రం’
సోదర సోదరీమణుల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీక ఈ రాఖీపౌర్ణమి. ప్రేమ అనే రాఖీను చేతికి కట్టి.. ఆప్యాయతానురాగాల తీపిని పంచి.. "నువ్వు నాకు రక్ష.. నేను నీకు రక్ష" అనే జీవితపు హామీ తీసుకునే పండగే ఈ రక్షాబంధన్. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- ఇదా వారు కలలు కన్న స్వేచ్ఛాభారతం?
ఏ రోజు దినపత్రికలు తిరగేసినా, టీవీ ఛానళ్లు తిలకించినా- ఆడపిల్లల మానాభిమానాల్ని చెరపట్టే గాంధారి కొడుకులు గల్లీకొకడుగా దాపురించిన వైపరీత్యానికి అవి అద్దం పడుతున్నాయి. అచ్చోసిన మృగాళ్ల విచ్చలవిడితనానికి ఆ రాష్ట్రం, ఈ ప్రాంతం అనేముంది- దేశం నలుమూలలా లెక్కకు మిక్కిలి ఉదాహరణలు పోగుపడుతున్నాయి. దేశంలో మహిళలెవరికీ ఎక్కడా భద్రత లేనేలేదని ఈ ఘటనలు ఎలుగెత్తుతున్నాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- 'చెల్లెలి కొడుకే అమ్మకు ఇష్టం.. అందుకే చంపేశా'
సొంత చెల్లెలి కుమారుడినే హతమార్చింది ఓ మహిళ. తన భర్తతో కలిసి రెండేళ్ల బాబును కిడ్నాప్(Kidnap) చేసి.. గొంతు నులిమి చంపింది(Murder). గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని డ్రైనేజీ గుంటలో పడేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- సమాఖ్య స్ఫూర్తికి ఆలంబన.. అధికార వికేంద్రీకరణ
సమాఖ్య వ్యవస్థను(federal system in India) బలోపేతం చేయడానికి దేశీయంగా ఇంకెన్నో చర్యలు చేపట్టాలి. సాంకేతికంగా శరవేగంగా మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా స్పందించాలి. మానవాళి అంతటినీ కుదిపేస్తున్న సంక్షోభాలను- కొవిడ్(Covid-19) లాంటి మహమ్మారులు, భూతాపం.. దాని పర్యవసానంగా కలుగుతున్న వాతావరణ మార్పులు(Climate Changes) తదితరాలను అధిగమించే నైపుణ్యం ఉండే రీతిలో రాజ్యవ్యవస్థలో మార్పులు రావాలి. మూడో అంచెలో నిజమైన సమాఖ్య(federal system) వ్యవస్థను నిర్మిస్తూనే, కేంద్రం- రాష్ట్రాల మధ్య మరింత ఆరోగ్యకర ఏర్పాట్లకు ప్రోదిచేయాలి. పూర్తి వివరాలకు క్లిక చేయండి
- Afghan news: 'దానర్థం.. తాలిబన్ల పాలనను గుర్తిస్తామని కాదు'
అఫ్గాన్(Afghan news) ప్రజలు సురక్షితంగా తరలించే అంశంపై మాత్రమే తాలిబన్లతో(Taliban) తాము మాట్లాడుతున్నామని యూరోపియన్ యూనియన్ కమిషన్(European Union commission) తెలిపింది. అయితే.. దానర్థం తాలిబన్ల పాలనను తాము గుర్తిస్తామని(Taliban international recognition) మాత్రం కానేకాదని స్పష్టం చేసింది. మరోవైపు, కాబుల్‌లో పరిస్థితి రోజురోజుకూ మరింత దిగజారుతోందని అఫ్గాన్‌లో బ్రిటన్‌కు చెందిన ప్రముఖ జంతు సంరక్షకుడు, మాజీ రాయల్ మెరైన్ పాల్ ఫార్థింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- Neeraj Chopra: ఫోన్ పక్కన పెట్టా.. స్వీట్లు మానేశా
టోక్యో ఒలింపిక్స్‌లో అదరగొట్టిన నీరజ్ చోప్డా.. 100 ఏళ్ల కలను సాకారం చేశాడు. ప్రస్తుతం ఆ విజయాన్ని ఆస్వాదిస్తున్న అతడికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాల్ని తెలుసుకుందాం.
- మెగాస్టార్ కొత్త సినిమా 'బోళా శంకర్'
మెగాస్టార్ పుట్టినరోజున ఆయన అభిమానులను ఖుషీ చేసే వార్త ఇది. చిరు కొత్త సినిమాకు 'బోళా శంకర్' టైటిల్ పెట్టడం సహా ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి