- జగన్ అక్రమాస్తుల కేసులో బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదా
జగన్ అక్రమాస్తుల కేసులో బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. ఈ నెల 30కి సీబీఐ కోర్టు విచారణ వాయిదా వేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- FLOOD: గోదావరి నదికి పోటెత్తిన వరద.. నీటిలోనే లోతట్టు ప్రాంతాలు
గోదావరి నదికి వరద పోటెత్తుతోంది. ఎగువన కురిసిన వర్షాలకు భారీగా వరద నీరు తరలివస్తోంది. అంతకంతకు పెరుగుతున్న వరద పోటుతో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 10 లక్షల క్యూసెక్కులకు పైగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Kargil vijay Diwas: అమరవీరులకు తూర్పు నౌకా దళం నివాళులు
కార్గిల్ విజయ్ దివస్ ను పురస్కరించుకుని.. విశాఖలో తూర్పు నౌకాదళం అమరవీరులకు నివాళులు అర్పించింది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ నావల్ ప్రాజెక్ట్ వైస్ అడ్మిరల్ శ్రీకుమార్ నాయక్.. అమరవీరులకు గౌరవ వందనం సమర్పించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Charging points in IOC Petrol bunks: ఐవోసీ పెట్రోలు బంకుల్లో.. విద్యుత్ ఛార్జింగ్ కేంద్రాలు
రాష్ట్రంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) పెట్రోలు బంకుల్లో విద్యుత్ ఛార్జింగ్ కేంద్రాలను అందుబాటులోకి తేవాలని పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ (నెడ్‌క్యాప్) భావిస్తోంది. ఈ మేరకు ఐవోసీతో ఒప్పందం కుదుర్చుకోనుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Vijay Diwas 2021: అమర వీరులకు ప్రధాని నివాళులు
కార్గిల్ విజయ్ దివస్(Vijay Diwas 2021) సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. జవాన్ల ప్రాణ త్యాగాలు దేశం ఎల్లప్పుడూ స్మరించుకుంటుందని.. వారి వీరోచిత పోరాటాలు ప్రతిరోజూ స్ఫూర్తిని కలిగిస్తాయన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రూ.45లక్షల కోసం కట్టుకున్న భర్తను కడతేర్చిన భార్య
రూ. 45లక్షల కోసం కట్టుకున్న భర్తనే కడతేర్చింది భార్య. ఈ కేసులో నిందితురాలితోపాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Delta Variant: వెయ్యి రెట్లు ఎక్కువగా వైరస్ వ్యాప్తి!
కరోనా డెల్టా వేరియంట్(Delta Variant) ప్రమాదకర స్థాయిలో వ్యాప్తి చెందుతోంది. బాధితుడికి దగ్గరగా వెళ్లిన 4 రోజుల్లోనే ఇన్‌ఫెక్షన్ సోకుతోంది. ఈ వేరియంట్ బారిన పడ్డ రోగి నుంచి వెయ్యి రెట్లు ఎక్కువగా వైరస్ విడుదల అవుతోంది. డెల్టా వల్ల మరణ ముప్పు రెండు రెట్లు ఉంటోందని అధ్యయనాలు చెబుతున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Gold Rate today: ఏపీ, తెలంగాణలో బంగారం ధరలు ఎంతంటే?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. కేజీ వెండి ధర హైదరాబాద్‌లో రూ.69 వేల పైన ట్రేడవుతోంది. పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పూ లేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అయ్యో తుపాకీ.. ఎంత పని చేశావ్!
ఒలింపిక్స్‌లో షూటర్ల నిరాశాజనక ప్రదర్శన కొనసాగుతోంది. వరుసగా రెండో రోజూ ఈ క్రీడలో పతకం దక్కలేదు. కచ్చితంగా పతకం వస్తుందనుకున్న 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో మను బాకర్‌తో పాటు యశస్విని సింగ్ దేశ్వాల్ ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ప్రముఖ నటి జయంతి కన్నుమూత
ప్రముఖ సీనియర్ నటి జయంతి(76) కన్నుమూశారు. ఆదివారం రాత్రి బెంగళూరులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఐదు దశాబ్దాల పాటు భారతీయ చిత్ర పరిశ్రమలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించిన ఈమె.. కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, మరాఠీ భాషల్లో సుమారు 500కుపైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మన్ననలు అందుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.