ETV Bharat / city

ప్రధానవార్తలు @ 9AM - trending news

ప్రధానవార్తలు @ 9AM

ప్రధానవార్తలు @ 9AM
ప్రధానవార్తలు @ 9AM
author img

By

Published : Jan 28, 2021, 9:02 AM IST

  • వాలంటీర్లు వద్దు...ఎస్ఈసీ

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడమే లక్ష్యమని.. ఆ దిశగా అధికార యంత్రాంగం సహకారం అందించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోరారు. ప్రభుత్వ అధికారులు సమన్వయంతో పని చేద్దామన్నారు. ఎన్నికలు సజావుగా నడపడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • కోర్టు ఉత్తర్వుల అమల్లో నిర్లక్ష్యంపై హైకోర్టు అసహనం

రాష్ట్రంలో ఎక్కువ మంది అధికారులు.... తాము చట్టం కన్నా ఎక్కువ అనే భావనలో ఉన్నారని.... ఇలాంటి పరిస్థితి ఇక్కడే చూస్తున్నామని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఎవరైనా అలా భావించొద్దని హితవు పలికింది. కోర్టు ఆదేశాల అమలుపై పలుసార్లు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని అసహనం వ్యక్తం చేసింది. ఓ కోర్టు ధిక్కరణ వ్యాజ్యంలో హైకోర్టుకు హాజరైన డీజీపీ గౌతమ్‌సవాంగ్‌, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజిత్‌ను ఉద్దేశించి ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • బిడ్డలిద్దరూ శివపార్వతులు.. నేను కాళికను!

పెద్ద కుమార్తె రోజూ దేవుడితో మాట్లాడుతోందనే భావనలో ఇద్దరు కుమార్తెల హత్య కేసు నిందితురాలు పద్మజ ఉండేదని.. పోలీసుల రిమాండ్​ నివేదికలో తెలుస్తోంది. దేవుడు ఏ రోజు ఏం చేయాలో శివుడికి (పెద్ద కుమార్తె) చెబుతాడని.. పద్మజ అది నమ్మేదని సమాచారం. దెయ్యాన్ని వదిలించాలనే క్రమంలో వారు డంబెల్‌తో పెద్ద కుమార్తె తలపై కొట్టారని నివేదికలో వెల్లడైంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • చలి కుంపటి మంటలు అంటుకుని వృద్ధురాలు సజీవదహనం

చలి కుంపటి మంటలు అంటుకుని ఓ వృద్ధురాలు సజీవదహనం అయిన ఘటన విజయనగరం జిల్లాలో జరిగింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • దిల్లీ ఉద్యమానికి 'దీప్'‌ పొగ!

దిల్లీలో ఈ నెల 26న జరిగిన రైతుల ఆందోళనలు దారితప్పడం, కిసాన్​ పరేడ్​లో అల్లర్లు.. వంటి పరిణామాల మధ్య పంజాబీ నటుడు, గాయకుడు దీప్​ సిద్ధూ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఎర్రకోట ఉద్రిక్తతలకు ఇతడే కారణమని పలు రైతు సంఘాలు ఆరోపణలు చేస్తున్నాయి. శాంతియుతంగా సాగుతున్న ఉద్యమాన్ని దారిమళ్లించాడనిదుయ్యబట్టాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • ఈ నెల 31 వరకు ఎర్రకోట మూసివేత​

ఎర్రకోట సందర్శనపై ఈనెల 31 వరకు ప్రజలకు అనుమతి రద్దు చేస్తున్నామని కేంద్రం ప్రకటించింది. గణతంత్ర దినోత్సవం రోజు రైతుల ట్రాక్టర్​ ర్యాలీ హింసాత్మకం అయిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • అవిభక్త కవలలకు అరుదైన శస్త్రచికిత్స

ముంబయిలోని ఓ ఆసుపత్రి వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేశారు. ఒకే కాలేయంతో ఉదరభాగం అతుక్కుని పుట్టిన కవలలకు విజయవంతంగా శస్త్రచికిత్స చేసి విడదీశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • సమస్యల్లోంచి సుడిగుండంలోకి నేపాల్​ రాజకీయాలు!

పార్లమెంటు రద్దుతో నేపాల్​లో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. ప్రధాని కేపీ శర్మ ఓలీ చర్య రాజ్యాంగ విరుద్ధం. రాచరిక శక్తులు అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. మరి ఇప్పుడు నేపాల్​ భవిష్యత్తు ఏమిటి? పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • భారత్​ x ఇంగ్లాండ్​: చెన్నై చేరుకున్న కోహ్లీ

చెన్నైలో ఫిబ్రవరి 5 నుంచి ఇంగ్లాండ్​తో జరగనున్న తొలి రెండు టెస్టుల కోసం టీమ్​ఇండియా ఆటగాళ్లు వరుసగా చెన్నైకు చేరుకుంటున్నారు. తాజాగా భారత జట్టు సారథి విరాట్​ కోహ్లీ కూడా చెన్నైకు చేరుకున్నాడు. అనంతరం క్వారంటైన్​లోకి వెళ్లిపోయాడు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • బాబాయ్​తో అబ్బాయి హీరోయిన్!

పవర్​స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకంపై ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమాలో హీరోయిన్​గా రకుల్ ప్రీత్ నటించబోతున్నట్లు సమాచారం. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.