- 'ప్రజలకు ఏం చేయాలో భాజపాకు తెలుసు'
నరేంద్ర మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన ఏడాదిలో అనేక అభివృద్ధి పనులు చేపట్టిందని కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ అన్నారు. ప్రజలకు ఏం కావాలో...ఏం చేయాలో భాజపాకు తెలుసని వ్యాఖ్యానించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- రెండో రోజు ప్రశ్నిస్తున్న అనిశా
తెదేపా నేత అచ్చెన్నాయుడిని అనిశా అధికారుల బృందం రెండోరోజూ విచారించింది. ఉదయం నుంచి దాదాపు ఐదు గంటల పాటు విచారించారు. రేపు కూడా అధికారులు అచ్చెన్నాయుడిని విచారించనున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'డిగ్రీ, పీజీ పరీక్షలు రద్దు చేయండి'
డిగ్రీ, పీజీ ఆఖరి సంవత్సరం పరీక్షలు రద్దు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ మంత్రి వ్యాఖ్యలు విద్యార్థులను గందరగోళానికి గురిచేసేలా ఉన్నాయన్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- శ్రీసిటీపై కరోనా ఎఫెక్ట్
చిత్తూరు జిల్లాలో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులు శ్రీసిటీపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. శ్రీసిటీలోని ఓ పరిశ్రమలో పనిచేస్తున్న 19 మందికి కరోనా సోకడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- కరోనా రిస్క్ ఎక్కడ ఎక్కువ?
రెండు నెలల నుంచి ఇంట్లో ఉండటానికి ఇబ్బంది పడ్డ ప్రజలు.. ఇప్పుడు బయటకు వెళ్లడానికి భయపడాల్సి వస్తోంది. లాక్డౌన్లో బలవంతంగా ఒకే చోట ఉన్న జనం.. ఇప్పుడు స్వచ్ఛందంగానే ఉండాలని కోరుకుంటున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- యూసుఫ్ మెమన్ మృతి
1993 ముంబయి వరుస పేలుళ్ల కేసులో దోషిగా తేలిన యూసుఫ్ మెమన్ మృతి చెందాడు. అయితే మృతికి గల కారణాలు తెలియరాలేదు. మహారాష్ట్ర నాసిక్ జిల్లాలోని ఠాణె రోడ్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు మెమన్. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- ఏడాదిలోపు కరోనా వ్యాక్సిన్
కరోనా వ్యాక్సిన్ ఏడాది లోపు వచ్చే అవకాశం ఉందని తెలిపారు ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్. బలహీనులకు, వైరస్ బారినపడే అవకాశం ఉన్నవారికి మాత్రమే వ్యాక్సిన్ ఇవ్వడం ఓ ప్రత్యామ్నాయమని చెప్పారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- పెరిగిన బంగారం, వెండి ధరలు
బంగారం ధరలు శుక్రవారం గరిష్ఠ స్థాయిలో పెరిగాయి. 10 గ్రాముల పుత్తడి రూ. 239, కిలో వెండిపై రూ. 845 వృద్ధి చెందాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'ప్రభుత్వం అనుమతిస్తే హైదరాబాద్‌లో శిక్షణ ప్రారంభం'
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తే జులై 1 నుంచి బ్యాడ్మింటన్ శిక్షణా శిబిరాలను తిరిగి ప్రారంభిస్తామని భారత బ్యాడ్మింటన్ సంఘం కార్యదర్శి అజయ్ సింఘానియా తెలిపారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- వెబ్‌సిరీస్‌గా 'షాడో'
ప్రసిద్ధ తెలుగు నవల 'షాడో' ఆధారంగా ఓ వెబ్‌సిరీస్ రూపొందనుంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ ఈ సిరీస్‌ను తెరకెక్కించబోతున్నట్లు ప్రకటించింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.