ETV Bharat / city

డ్రగ్స్​ కేసు: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు

2017లో టాలీవుడ్​తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం స్పష్టించిన డ్రగ్స్ కేసులో తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి వేసిన పిటిషన్​పై ఆ రాష్ట్ర హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. వాదనలు విన్న ధర్మాసనం తెరాస సర్కార్​కు కీలక ఆదేశాలు ఇచ్చింది.

telangana high court
telangana high court
author img

By

Published : Nov 12, 2020, 4:43 PM IST

డ్రగ్స్‌ కేసులో సిట్‌ దర్యాప్తుపై నివేదిక ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసుపై 2017లో రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన పిల్‌పై గురువారం న్యాయస్థానం విచారణ జరిగింది. ఈ వ్యవహారంలో అంతర్జాతీయ ముఠాల ప్రమేయం ఉన్నందున ఎక్సైజ్‌ సిట్‌ పరిధి సరిపోదని రేవంత్‌రెడ్డి పిటిషన్‌లో పేర్కొన్నారు.

సీబీఐ, ఈడీ, నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో వంటి కేంద్ర సంస్థలకు ఈ కేసును అప్పగించాలని రేవంత్ పిటిషన్​లో కోరారు. దర్యాప్తునకు ఈడీ, ఎన్​సీబీ సిద్ధంగా ఉన్నాయని న్యాయవాది రచనారెడ్డి ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఈడీ, ఎన్‌సీబీకి రాష్ట్ర ప్రభుత్వం వివరాలు ఇవ్వడం లేదని వాదనలు వినిపించారు. దీనిపై స్పందంచిన ధర్మాసనం సిట్‌ దర్యాప్తు ఏ స్థితిలో ఉందో డిసెంబరు 10లోగా తెలపాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

ఇదీ చదవండి

డ్రగ్స్ తాయారీకి హైదరాబాద్​ కేంద్రమైంది.. అందుకే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.