ETV Bharat / city

chandrababu: వైకాపా ద్వంద్వ వైఖరిని పార్లమెంట్​లో ఎండగట్టండి: చంద్రబాబు

author img

By

Published : Jul 16, 2021, 8:52 PM IST

రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే విషయంలో రాజీపడకుండా పార్లమెంట్​లో ఎంతవరకైనా పోరాడాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు(chandrababu) పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. వైకాపా ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని పార్లమెంట్​లో ఎండగట్టాలని సూచించారు. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం వైకాపా చిత్తశుద్ధితో కృషి చేస్తే మద్దతు ఇవ్వటానికి సిద్ధమని.. అవసరమైతే రాజీనామాలు చేసి ప్రభుత్వం చేసే పోరాటంలో పాల్గొంటామని ఎంపీలు తెలిపారు.

tdp meeting
తెదేపా సమావేశం

అమరావతి ఎన్టీఆర్ భవన్​లో ఎంపీలతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు(chandrababu) పార్లమెంటరీ పార్టీ సమావేశం(Parliamentary Party Meeting) నిర్వహించారు. ఈ నెల 19వ తేదీ నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. జగన్‌ ప్రభుత్వ నిర్లక్ష్యంతో రాష్ట్రంలో కరోనా విజృంభన, ప్రజలకు సరైన వైద్యం అందకపోవడం, కరోనా కోసం కేంద్రం కేటాయించిన నిధులను దారి మళ్లించడం, మృతుల సంఖ్యను తక్కువగా చూపడం, కరోనా ప్యాకేజీ ఇవ్వకపోవడం వంటి అంశాలను పార్లమెంట్​లో ప్రస్తావించాలన్నారు. సంక్షోభ సమయంలో ప్రజలకు అండగా నిలవాల్సిన ముఖ్యమంత్రి చేతులెత్తేసి లక్షలాదిమంది కరోనా బారిన పడేలా చేశారని చంద్రబాబు మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని కక్ష సాధింపు చర్యలకు దుర్వినియోగం చేయడం, అక్రమ కేసులను పార్లమెంట్​లో లేవనెత్తాలన్నారు. విశాఖ ఉక్కు, రైతులు పండించిన పంటలకు మద్దతు ధర, పోలవరం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేయడం వంటి అంశాలను పార్లమెంట్​లో ప్రస్తావించాలని చంద్రబాబు తెలిపారు.

ప్రత్యేకహోదా, వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధికి ప్యాకేజీ, విభజన చట్టంలోని హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని చంద్రబాబు ఆక్షేపించారు. రెండేళ్ల నుంచి ఉపాధి హామీ పథకం కింద చేసిన పనులకు కేంద్రం నిధులు ఇచ్చినప్పటికీ.. వాటిని ఇవ్వకుండా దారి మళ్లించి కాంట్రాక్టర్లను వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయస్థానాలు ఆదేశించినా ఉపాధి హామీ బిల్లులు చెల్లించకుండా కాంట్రాక్టర్లపై కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని విమర్శించారు. ఉపాధి హామీ బిల్లుల చెల్లింపు అంశంపై పార్లమెంటులో ప్రస్తావించాలన్నారు. వీరోచిత పోరాటాలు, ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్న విశాఖ ఉక్కు(visakha steel plant)ను కాపాడుకునేందుకు కృషి చేయాలని తెదేపా ఎంపీలకు చంద్రబాబునాయుడు సూచించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ భూములను కాజేసేందుకు వైకాపా చేస్తున్న కుట్రలను పార్లమెంట్​లో ఎండగట్టాలన్నారు. మాన్సాస్‌ ట్రస్టుపై జగన్‌రెడ్డి కక్షసాధింపు చర్యలకు దిగుతున్న వైనాన్ని కూడా పార్లమెంటులో ప్రస్తావించాలన్నారు.

రాజకీయ ప్రయోజనాలే..

స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని సమావేశం అనంతరం ఎంపీలు వెల్లడించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ స్థానికంగా ఉన్న పరిస్థితులు కేంద్రానికి వివరిస్తామన్నారు. ఎంపీ రఘురామ కృష్ణరాజు(raghurama krishnaraju)పై అనర్హత వేటు వేయించేందుకు వైకాపా ఎంపీలు శక్తినంతా కూడగడుతున్నారని మండిపడ్డారు. రాజకీయ ప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు వైకాపాకు పట్టట్లేదని విమర్శించారు. విభజన హామీల అమలుపై కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు.

కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు..

వైకాపా ఎంపీ అయోధ్య రామిరెడ్డికి చెందిన రాంకీ కంపెనీలో రూ.300 కోట్ల బ్లాక్‌మనీని ఆదాయపన్ను శాఖ అధికారులు గుర్తించిన అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తాలని చంద్రబాబు.. నేతలకు సూచించారు. భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా కస్టడీలో ఉన్న ఎంపీ రఘురామకృష్ణరాజుపై దాడికి పాల్పడ్డారన్న చంద్రబాబు.. ఏపీ సీఐడీ(ap cid) అధికారులు వ్యవహరించిన తీరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైందని గుర్తు చేశారు. అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న ఈ విషయాన్ని పార్లమెంటులో చర్చించాలన్నారు. తెదేపా శ్రేణులపై అక్రమ కేసులను కేంద్ర హోంమంత్రిని కలిసి ఫిర్యాదు చేయాలని ఎంపీలకు సూచించారు.

అవసరమైతే ఇతర పార్టీల మద్దతు..

ఉత్తరాంధ్రలో జరుగుతున్న అక్రమ మైనింగ్​పై కేంద్రం జోక్యాన్ని కోరతామన్న ఎంపీలు... జల వివాదాలకు సంబంధించి రాష్ట్ర హక్కులు కోసం పోరాడతామని స్పష్టం చేశారు. ఆస్తుల పరిరక్షణ, స్వలాభం కోసం జగన్ రెడ్డి ఆడుతున్న నాటకాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. రాష్ట్రంలో లోపించిన శాంతి భద్రతల అంశాలను పార్లమెంట్​లో లేవనెత్తుతామన్న ఎంపీలు.. అవసరమైతే ఇతర పార్టీల మద్దతు కోరతామని తెలిపారు.

తెదేపా ఎంపీలు
ఈ సమావేశంలో ఎంపీలు గల్లా జయదేవ్‌, రామ్మోహన్‌నాయుడు, కేశినేని నాని, కనకమేడల రవీంద్రతో పాటు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు, పొలిట్ బ్యూరో సభ్యులు నిమ్మల రామానాయుడు, టీడీ జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి

PAWAN KALYAN: నిరుద్యోగులకు బాసటగా పోరాటం: పవన్‌ కల్యాణ్‌

TDP: 'వైకాపా నేతలు భూకబ్జాలకు పాల్పడుతున్నారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.