ETV Bharat / city

ఏకగ్రీవాలు చేసుకుంటున్నప్పుడు ఎన్నికలెందుకు: కళా వెంకట్రావ్

వైకాపా ప్రభుత్వంపై మాజీ మంత్రి కళా వెంకట్రావ్ విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో అన్నీ ఏకగ్రీవాలు చేసుకునే దానికి.. ఎన్నికల పేరుతో ప్రజాధనం దుర్వినియోగం చేయడం ఎందుకుని ప్రభుత్వాన్ని నిలదీశారు.

tdp leader kala venkata rao
tdp leader kala venkata rao
author img

By

Published : Mar 7, 2021, 4:00 PM IST

వైకాపా ప్రభుత్వ హయాంలో స్థానిక ఎన్నికలు ప్రహసనంగా మారాయని తెదేపా సీనియర్ నేత కళా వెంకట్రావు అన్నారు. ప్రతి 50 కుటుంబాలకు ప్రభుత్వం ఓ మనిషిని వాచ్​మెన్​లా పెట్టిందని ఆయన విమర్శించారు. ఇలాంటి పరిస్థితిలో ప్రజలు స్వేచ్ఛగా ఓటు ఎలా వేస్తారని ఆయన ప్రశ్నించారు. జగన్ సీఎంగా ఉన్నంత కాలం స్థానిక ఎన్నికలు ఉండవని చట్ట సవరణ చేసుకోవాలని ప్రభుత్వానికి సూచిస్తున్నట్లు చెప్పారు. అన్నీ ఏకగ్రీవాలు చేసుకునే దానికి ఎన్నికల పేరుతో ప్రజాధనం దుర్వినియోగం చేయడం ఎందుకని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారు: బండారు సత్యనారాయణ

జీవీఎంసీ ఎన్నికల కోసం వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి కోట్ల రూపాయలు అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని తెదేపా సీనియర్ నేత బండారు సత్యనారాయణ మూర్తి ఆరోపించారు. పది రోజుల్లో 400కోట్ల రూపాయలను పారిశ్రామికవేత్తలు, గుత్తేదారుల నుంచి బలవంతంగా వసూలు చేశారన్నారు. ఈ ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను సమయం వచ్చినప్పుడు బయటపెడతామన్నారు.

ఇదీ చదవండి

ఇక్కడ పాదయాత్ర, దిల్లీలో పాదపూజా..?: నారాయణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.