ETV Bharat / city

సీఐడీ విచారణకు దేవినేని ఉమా గైర్హాజరు - వీడియో మార్ఫింగ్​ల కేసులో దేవినేనికి సీఐడీ నోటీసులు

తెదేపా నేత దేవినేని ఉమా సోమవారం కర్నూలులో సీఐడీ విచారణకు గైర్హాజరయ్యారు. మరోసారి నోటీసు ఇస్తామని, అప్పటికీ స్పందించకపోతే ఉన్నతాధికారుల ఆదేశాలను అనుసరిస్తామని అధికారులు చెప్పారు.

tdp leader devineni uma
cid case on devineni uma
author img

By

Published : Apr 20, 2021, 7:37 AM IST

మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సోమవారం కర్నూలులో సీఐడీ విచారణకు గైర్హాజరయ్యారు. సీఎం జగన్‌ మాటలను వక్రీకరించారని, వీడియోను మార్ఫింగ్‌ చేసి దుష్ప్రచారం చేశారన్న అభియోగంపై ఈ నెల 10న ఉమాపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేసిన సంగతి విదితమే.

కర్నూలు ప్రాంతీయ సీఐడీ అధికారి రవికుమార్‌కు కేసు విచారణ బాధ్యతలు అప్పగించిన నేపథ్యంలో.. ఈ నెల 15న విచారణకు హాజరుకావాలంటూ మొదటి నోటీసు జారీ చేశారు. ఆ రోజున ఉమా గైర్హాజరవడంతో ఈ నెల 19న రావాలని మరో తాఖీదు ఇచ్చారు. సోమవారమూ రాకపోవడంతో మరోసారి నోటీసు ఇస్తామని, అప్పటికీ స్పందించకపోతే ఉన్నతాధికారుల ఆదేశాలను అనుసరిస్తామని రవికుమార్‌ తెలిపారు.

ఇదీ చదవండి:

విశాఖ ఉక్కు పరిశ్రమ... కొవిడ్ రోగుల పాలిట ప్రాణదాత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.