Supreme Court stay on AP High Courts investigation: రాష్ట్ర పునర్విభజనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉన్న పిటిషన్ విచారణపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడంతోపాటు విభజన హామీలను అమలు చేయాలంటూ ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ 2019లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు రాష్ట్ర పునర్విభజనపై తెలంగాణకు చెందిన పొంగులేటి సుధాకర్‌రెడ్డి, పలువురు దాఖలు చేసిన పిటిషన్లు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నందున కొణతాల పిటిషన్‌ను ఇక్కడికే బదిలీ చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానంలో బదిలీ పిటిషన్ వేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యు.యు.లలిత్, జస్టిస్ ఎస్.రవీంద్రభట్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ చేపట్టింది. ఏపీ హైకోర్టులో విచారణపై స్టే విధించిన ధర్మాసనం... కొణతాల రామకృష్ణ, నీతిఆయోగ్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. కేసు తదుపరి విచారణను అక్టోబరు 14వ తేదీకి వాయిదా వేసింది.
ఇవీ చదవండి: