ETV Bharat / city

రాష్ట్రంలో పండుగలా ఇళ్ల పట్టాల పంపిణీ - statewide housing lands distribution

రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన పేదలందరికీ.. సీఎం జగన్ ప్రభుత్వం ఇళ్ల పట్టాలను అందించింది. ముక్కోటి ఏకాదశి, క్రిస్టమస్, జుమ్మాలతో పాటు.. ఈ కార్యక్రమమూ ఓ పండుగలా జరిగింది. ఆయా నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరై.. లబ్ధిదారులకు స్థలాలను అందజేశారు. చరిత్రలో నిలిచిపోయేలా ఈ ఘట్టం ఉందని పలువురు వ్యాఖ్యానించారు.

plots distribution
ఇళ్ల పట్టాల పంపిణీ
author img

By

Published : Dec 26, 2020, 6:15 AM IST

సీఎం జగన్ సందేశాన్ని వినిపించిన అనంత‌రం.. జిల్లాల వ్యాప్తంగా ప్ర‌జాప్ర‌తినిధులంతా లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీకి శ్రీ‌కారం చుట్టారు. అర్హులైన పేదలకు వారి చేతుల మీదుగా స్థలాలు అందజేశారు.

ప్రకాశం జిల్లాలో...

పేదవాడి సొంత ఇంటి కల నెరవేర్చిన వ్యక్తి సీఎం జగన్​ అని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. చీరాలలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలతో పాటు నిర్మాణ పత్రాన్ని అందజేశారు. ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, మాజీ ఎమ్మెల్సీ పోతుల సునీతతో కలిసి అక్కడ మొక్కలు నాటి.. వైఎస్సార్, జగనన్న కాలనీకి ఆయన శంకుస్థాపన చేశారు. అర్హులందరికీ ఇళ్ల స్థలం ఇచ్చామని.. ఇంకా ఎవరైనా మిగిలిపోతే ధరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

కడప జిల్లాలో...

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ.. దేశ చరిత్రలోనే మహత్తరమైన శుభకార్యమని ఉపముఖ్య మంత్రి ఎస్.బీ.అంజాద్ బాషా అన్నారు. ఉక్కాయపల్లి లేఅవుట్​లో 1,066 మందికి ఆయన పట్టాలు అందజేశారు. వైకుంఠ ఏకాదశి, క్రిస్టమస్, జుమ్మా అన్నీ కలసి వచ్చిన ఒకేరోజు.. ఇళ్ల పట్టాల పంపిణీ జరగడం శుభపరిణామమన్నారు. మంచి పనులకు భగవంతుని ఆశీస్సులు ఉంటాయనడానికి సీఎం జగన్ చేపట్టే కార్యక్రమాలే నిదర్శనం అన్నారు.

శ్రీకాకుళం జిల్లాలో...

ఆమదాలవలస మండలం గాజులకొల్లివల వద్ద స్పీకర్ తమ్మినేని సీతారాం.. పేదలకు ఇళ్ల స్థలాలు అందజేశారు. 4,859 మందికి పట్టాలు పంపిణీ ఇచ్చి.. ఇళ్ల నిర్మాణాలకు భూమి పూజ చేశారు. బహిరంగ సభలో క్రిస్మస్ సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.

నెల్లూరు జిల్లాలో...

ఇళ్ల పట్టాల పంపిణీ ద్వారా రాష్ట్రంలోని పేద మహిళల కళ్లలో పండుగ వాతావరణం కనిపిస్తోందని ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఉదయగిరి మండలం గంగిరెడ్డి పల్లిలో లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారు. తెదేపా హయాంలో గృహ నిర్మాణ వ్యవస్థ కుంటుపడిందని.. సీఎం జగన్ అధికారం చేపట్టిన వెంటనే ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నారన్నారు. తెదేపా ఎన్ని అడ్డంకులు సృష్టించినా దృఢ సంకల్పంతో పేదల సొంతింటి కలను ముఖ్యమంత్రి సాకారం చేస్తున్నారన్నారు. ప్రజలకు నచ్చేలా, ప్రజలు మెచ్చేలా పాలిస్తున్న జగన్.. పది కాలాల పాటు సీఎంగా కొనసాగేందుకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.

నాయుడుపేట పురపాలక సంఘం శనివాసపురంలో 1,150 మందికి.. ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ప్రజా సంక్షేమానికి సీఎం జగన్ పాటు పడుతున్నారని పేర్కొన్నారు. తెదేపాపై విమర్శలు గుప్పించారు.

విజయనగరం జిల్లాలో...

విజ‌య‌న‌గ‌రం మండ‌లం గుంక‌లాంలో ఈ నెల 30న ముఖ్యమంత్రి ప్రారంభించ‌నుండగా.. జిల్లాలోని ఈ ఒక్క నియోజ‌క‌వ‌ర్గంలో ఇళ్ల పట్టాల పంపిణీ ప్రారంభం కాలేదు. కురుపాంలో ఉప‌ముఖ్య‌మంత్రి పాముల పుష్ప‌ శ్రీ‌వాణి, చీపురుప‌ల్లిలో మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణతో పాటు ఎంపీ బెల్లన చంద్ర‌శేఖ‌ర్‌, సాలూరులోని గుమ‌డాం సహా నెలిప‌ర్తిలో ఎమ్మెల్యే పీడిక రాజ‌న్న‌దొర, ఎస్‌.కోటలో ఎమ్మెల్యే క‌డుబండి శ్రీ‌నివాస‌రావు, పూస‌పాటిరేగ మండ‌లం కోనాడ‌లో ఎమ్మెల్సీ పెనుమ‌త్స సురేష్‌బాబుతో కలసి ఎమ్మెల్యే బ‌డ్డుకొండ అప్ప‌ల‌నాయుడు, పార్వ‌తీపురంలోని న‌ర్సీపురం, బొబ్బిలి మున్సిపాలిటీలో ఎమ్మెల్యే శంబంగి వెంక‌ట చిన్నఅప్ప‌ల‌నాయుడు, గ‌జ‌ప‌తిన‌గ‌రంలోని పురుటిపెంటలో ఎమ్మెల్యే బొత్స అప్ప‌ల‌న‌ర‌స‌య్యలు.. ఈ కార్యక్రమానికి శ్రీ‌కారం చుట్టారు. పలు చోట్ల ప‌ట్టాల పంపిణీతో పాటు ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించారు.

ఇళ్ల స్థలాల అందజేత, టిడ్కో గృహాల రిజిస్ట్రేషన్​.. మొత్తం కలిపి లక్షా ఎనిమిది వేల ఇళ్ల పట్టాలు ఈరోజు జిల్లాలో పంపిణీ చేస్తున్నామని మంత్రి బొత్స తెలిపారు. 8,048 టడ్కో ఇళ్లు, 24,248 పొజిషన్ ధ్రువపత్రాలు, 71,749 కొత్త స్థలాలు ఈరోజు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. గరివిడిలో 1437, చీపురుపల్లిలో 1515, గుర్లలో 763, మెరకముడిదాంలో 2613 మందికి వీటిని అందజేయనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రమంతా ఈరోజు ఇళ్ల పట్టాల పంపిణీ అనే పెద్ద పండుగ జరుగుతోందని.. అందులో మేమూ పాల్గొనడం సంతోషంగా ఉందని ఎంపీ బెల్లన చంద్రశేఖర్ తెలిపారు. క్రిస్టమస్, ముక్కోటి ఏకాదశి, ఇళ్ల పట్టాల పంపిణీ.. మూడు పండగలు కలయిక అద్భుతంగా ఉందని కొనియాడారు.

పార్వతీపురంలో ఇళ్ల స్థలాల పంపిణీని ఎమ్మెల్యే అలజంగి జోగారావు ప్రారంభించారు. కొత్తవలసలో లబ్ధిదారులకు పట్టాలు అందించారు. పేదవారికి సొంతింటి కల నెరవేర్చడమే సీఎం జగన్ లక్ష్యమని పేర్కొన్నారు.

పశ్చిమగోదావరి జిల్లాలో...

పేదవాడి సొంతింటి కల ఈరోజుతో నిజం కానున్నదని నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు అన్నారు. రుస్తుంబాద పంచాయతీ మంగళ గుంట పాలెంలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. 31 లక్షల మంది లబ్ధిదారుల్లో 15.60 లక్షల మందికి ఇళ్లు మంజూరు చేశామన్నారు. నియోజకవర్గంలో మొత్తం 12,148 మంది లబ్దిదారులకు గాను.. మొదటివిడతగా 9,833 మందికి ఇస్తున్నామన్నారు. దరఖాస్తు చేసుకుంటే 90 రోజుల్లో అర్హతను పరిశీలించి పట్టా మంజూరు చేస్తామని ఇంఛార్జి సబ్ కలెక్టర్ తెలిపారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి 13 ఏళ్ల క్రితం పేదలకు సొంత ఇంటి కల నెరవేర్చారని.. ఇప్పుడు ఆయన తనయుడు జగన్ అదేబాటలో నడుస్తున్నారని మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు పేర్కొన్నారు.

కర్నూలు జిల్లాలో...

సొంత ఇల్లు ఒక కల, ధైర్యం, బలం అని ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. డోన్​ జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దొరపల్లి, ఉడుములపాడులోని వైఎస్సార్ జగన్ అన్న కాలనీలో ఇళ్ల స్థలాలకు శంకు స్థాపన చేశారు.

స్థానికంగా 350 ఎకరాల భూమి తీసుకుని.. సొంత గ్రామస్థులకే ఇళ్ల పట్టాల కేటాయింపులో అన్యాయం చేశారంటూ.. కోడుమూరు ఎమ్మెల్యే సుదాకర్​ను రుద్రవరం గ్రామస్థులు అడ్డుకున్నారు. పట్టాల పంపిణీ అనంతరం వెళ్తుండగా కారుకు అడ్డుగా నించుని.. వాగ్వాదానికి దిగారు. అర్హతలు ఉండీ పట్టా రానివారు తిరిగి ధరఖాస్తు చేసుకుంటే 90 రోజుల్లో ఇస్తామని ఎమ్మెల్యే సర్దిచెప్పారు.

ఆదోనిలో దాదాపు 22 వేల ఇళ్ల పట్టాలను లబ్ధిదారులకు ఇస్తున్నామని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. సీఎం జగన్ ఏ పని చేసినా చరిత్ర సృష్టిస్తారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.

గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా.. పెద్ద సంఖ్యలో పేదలకు ఇళ్ల పట్టాలతో పాటు గృహాలు నిర్మించి ఇస్తున్నామని కర్నూలు, పాణ్యం, కోడుమూరు ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, సుధాకర్, హాఫీజ్ ఖాన్ తెలిపారు. ఆయా నియెజకవర్గాల పరిధిలో 350 ఎకరాల్లో లబధిదారులకు ఇళ్ల స్థలాలను అందజేశారు. గృహాల నిర్మాణాలకు భూమి పూజ చేశారు.

అక్కా, చెల్లెమ్మలకు సీఎం జగన్​ ఎప్పుడూ తోడుగా ఉంటారని.. మంత్రి గుమ్మనూరు జయరాం, కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ తెలిపారు. ఆలూరులో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని.. స్థలాలను లబ్ధిదారులకు అందజేశారు. తండ్రి రాజశేఖర్​రెడ్డి వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని ఆయన అడుగు జాడల్లో నడుస్తున్నారని ముఖ్యమంత్రిని కొనియాడారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేక ప్రతిపక్ష పార్టీ నాయకులు ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు కోర్టుల్లో కేసులు వేశారని విమర్శించారు. అయినా వెనకాడకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని స్పష్టం చేశారు.

గుంటూరు జిల్లాలో...

దేశ చరిత్రలో ఒకే రోజు 31 లక్షల మందిని లక్షాధికారులను చేసిన ఘనత.. తమ ప్రభుత్వానిదేనని హోంమంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. గుంటూరులోని ఏటుకూరు పేదలకు ఆమె ఇళ్ల పట్టాలు పంపిణి చేశారు. ఎమ్మెల్యేలు ముస్తఫా, మద్దాలి గిరిధర్, కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్, మున్సిపల్ కమిషనర్ చల్లా అనురాధ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గతంలో ప్రభుత్వ భూములను ఇంటి స్థలాలుగా ఇచ్చేవారని.. ప్రస్తుతం లబ్ధిదారులకు ఇళ్లు కట్టించే బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుందని తెలిపారు. ఇదే వేదికపై మంత్రి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు.

తెదేపా నాయకులు కళ్లు ఉన్న కబోదులని.. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఎంపీ మోపిదేవి వెంకటరమణ రావు విమర్శించారు. రేపల్లె పట్టణంలో నిర్వహించిన ఇళ్ల పట్టాల పంపిణీలో ఆయన పాల్గొన్నారు. గత ప్రభుత్వాలు చేపట్టలేని ఎన్నో సంక్షేమ పథకాల ప్రవేశ పెట్టి.. క్షేత్ర స్థాయిలో పేద వాడికి అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా కోర్టుల్లో కేసులు వేశారని.. న్యాయస్థానాలూ తమ ప్రయత్నాన్ని అడ్డుకున్నాయని పేర్కొన్నారు. ఎన్ని కుయుక్తులు పన్నినా సంక్షేమ పథకాల అమలు ఆపబోమని తేల్చి చెప్పారు.

ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు చేతుల మీదుగా వినుకొండ ప్రజలకు నివేశన స్థలాల పట్టాలను అందజేశారు. జాల్లపాలెంలోని వైఎస్సార్​ కాలనీలో జరిగిన ఈ కార్యక్రమానికి వేలాదిగా మహిళలు తరలివచ్చారు. సీసీ రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్, ఉద్యానవనం, కళ్యాణ మండపం, దేవస్థానాలు, వాటర్ ట్యాంకులు, అంగన్​వాడీ కేంద్రాలతో పాటు ఇతర మౌలిక వసతులు కల్పించి.. మోడల్ సిటిగా తీర్చిదిద్దటమే తమ లక్ష్యమని తెలియజేశారు.

నవరత్నాల్లో 90 శాతం హామీలు పూర్తిచేసినట్లు పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య పేర్కొన్నారు. చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెం, పెదకాకాని మండలం నంబూరుల్లో లబ్ధిదారులకు ఆయన ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారు.

చిలకలూరిపేట మండలం పసుమర్రులో 8,218 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే విడదల రజిని నివేశన స్థలాలు పంపిణీ చేశారు. అక్కడే ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. లక్షలాది పేద ప్రజలకు గూడు కోసం సీఎం జగన్ చేపట్టిన ఈ కార్యక్రమం ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. స్వాతంత్ర్యం అనంతరం వచ్చిన ప్రభుత్వాలు, పాలకులు అందించిన నివేశన స్థలాలు 15,747 కాగా.. 18 నెలల కాలంలో ఈ నియోజకవర్గంలో ఒక్క రోజే 18,765 స్థలాలు పంపిణీ చేయడం రికార్డని కొనియాడారు.

ప్రకాశం జిల్లాలో...

యర్రగొండపాలెం మిల్లంపల్లి లే అవుట్​లోని ఇళ్ల పట్టాల పంపిణీలో మంత్రి ఆదిమూలపు సురేష్ పాల్గొన్నారు. నివేశ స్థలాల్లో పైలాన్​ను ప్రారంభించి.. లబ్ధిదారులకు స్థలాలను అందజేశారు. 15 రోజుల పాటు పండుగ వాతావరణంలో ఈ క్రమం జరుగుతుందని తెలిపారు.

అర్హులైన పేదలందరికీ ఇళ్లు కట్టించి ఇవ్వాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఒంగోలు పట్టణ నిరు పేదలకు టిడ్కో గృహాల విక్రయ ఒప్పంద పత్రాలను ఆయన పంపిణీ చేశారు. 365 చదరపు అడుగులు గృహాల లబ్ధిదారులకు ముందస్తు వాటాను రూ. 50 వేలు నుంచి రూ. 25 వేలుకు తగ్గించే విధంగా నిర్ణయం తీసుకున్నామన్నారు. 430 చదరపు అడుగులు లబ్ధిదారులకు లక్ష రూపాయల నుంచి రూ. 50 వేలుకు కుదించామని వెల్లడించారు. తమపేర్లు తొలగించారంటూ పలువురు మంత్రికి విన్నవించారు.

విశాఖ జిల్లాలో...

ఆనందపురంలో పేదలందరికీ ఇళ్లు పథకాన్ని మంత్రి అవంతి శ్రీనివాసరావు ప్రారంబించారు. ఆనందపురం, లొడగలవానిపాలెం, పాలవలస, పందలపాకలో 718 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను అందజేశారు. రాష్ట్రంలో 75 వేలకోట్ల రూపాయలను కోటి 50 లక్షల కుటుంబాలకు సంక్షేమ పథకాల రూపంలో అందజేశామన్నారు. పైసా లంచం తీసుకోకుండా సజావుగా లబ్ధిదారులకు చేర్చామన్నారు. అబివృద్ధి, సంక్షేమం, అవినీతి రహిత పరిపాలనే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని.. విశాఖ జిల్లా నర్సీపట్నంలో ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ప్రారంభించారు. బలిఘట్టం, నాతవరం మండలం అగ్రహారం ప్రాంతాల్లో లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు. అధికారం చేపట్టిన 18 నెలల్లోనే హామీలను నెరవేర్చిన ఘనత సీఎం జగన్​కే దక్కుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో మహిళలు హాజరయ్యారు.

సొంతింటి సంబరాలు పేరిట చోడవరంలో ఆరు వేల మందికి.. ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఇళ్ల పట్టాలను అందజేశారు. మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులు ఇచ్చిన అనంతరం స్థలాలు పంపిణీ చేశారు.

రాజకీయాలకు అతీతంగా అర్హులందరికీ ఇళ్ల స్థలాలను పంపిణీ చేస్తున్నట్లు ప్రభుత్వ విప్ ముత్యాలనాయుడు తెలిపారు. కె.కోటపాడు మండలం కొరువాడలో.. పేదలకు ఇళ్ల పట్టాలు అందజేశారు. రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ సువర్ణ పాలన అందిస్తున్నారని కొనియాడారు.

నెల్లూరు జిల్లాలో...

వెంకటగిరి పరిధిలో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీని ఎమ్మెల్యే ఆనం రామనారాయణ ప్రారంభించారు. పట్టణంలోని 1,900 మందికి పట్టాలు అందజేశారు. నియోజకవర్గం మొత్తంలో 7 వేలకు పైగా లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నట్లు పేర్కొంటూ.. ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు.

అనంతపురం జిల్లాలో...

గుంతకల్లులోని దోనిముక్కల రోడ్డులో.. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీని ఎమ్మెల్యే వై.వెంకట్రామిరెడ్డి ప్రారంభించారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన రెండేళ్ల లోపే నవరత్నాల్లోని సంక్షేమ పథకాలను అమలు చేస్తూ పాలిస్తున్నారన్నారు. పిలిస్తే పలికే దైవం ఆ సాయి బాబా ఐతే పిలవకుండా పలికే దైవం ముఖ్యమంత్రి జగన్ అని పేర్కొన్నారు. గుంతకల్లు, గుత్తి, పామిడి మండలాల్లో 11,379 మంది లబ్దిదారులకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు. కులం, మతం, పార్టీ భేదాభిప్రాయాలు లేకుండా అర్హత కలిగిన లబ్ధిదారులందరికీ సెంటు చెప్పున స్థలాలు కేటాయించామని తెలిపారు. తమ నాయకుడు అబద్ధపు హామీలు ఇవ్వలేదని.. చెప్పిన ప్రకారం మాట నిలబెట్టుకున్నాడన్నారు. తెదేపా నేతల్లా డబ్బు ఇచ్చి ఓటు కోరే స్వభావం తమది కాదని.. అభివృద్ధి చేసి హక్కుగా అడుగుతామని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

కరోనా స్ట్రెయిన్‌పై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.