ETV Bharat / city

AP News: 2021-22 ఆర్థిక సంవత్సరంలో వివిధ రంగాలకు రూ.2.83 లక్షల కోట్ల రుణాలు - రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి సమావేశం

ఖరీఫ్‌, రబీ పంట కాలాల్లో 1.10 లక్షల కోట్ల రూపాయల పంట రుణాలు ఇవ్వాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి నిర్ణయించింది. ఈ కారణంగా వ్యవసాయ రంగానికి గతేడాది కంటే 15% అధికంగా రుణాలు అందనున్నాయి.

Crop loans
పంట రుణాలు
author img

By

Published : Jun 14, 2021, 8:14 AM IST

ఖరీఫ్‌, రబీ పంట కాలాల్లో రూ.1.10 లక్షల కోట్లను పంట రుణాలుగా ఇవ్వాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్‌ఎల్‌బీసీ) నిర్ణయించింది. ఇందులో కౌలు రైతులకు రూ.4,100 కోట్లను కేటాయించారు. మొత్తంగా వ్యవసాయ రంగానికి ఇచ్చే రుణాల మొత్తం గతేడాది కంటే 15% పెంచి రూ.1,48,500 కోట్లు అందించనున్నారు. వ్యవసాయ, అనుబంధ కార్యకలాపాలకు రూ.31,041 కోట్ల రుణాలు ఇవ్వాలని నిర్ణయించారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో వివిధ రంగాలకు రూ.2.83 లక్షల కోట్ల రుణ పరపతి కల్పించాలని ఎస్‌ఎల్‌బీసీ ప్రణాళిక రూపొందించింది. ఇది గతేడాది కంటే (రూ.2.52 లక్షల కోట్లు) 13% అధికంగా ఉంది. క్యాంపు కార్యాలయంలో సోమవారం నిర్వహించే సమావేశంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రుణ ప్రణాళికను విడుదల చేయనున్నారు.

  • గతేడాది రూ.94,629 కోట్లను పంట రుణాల లక్ష్యం కాగా.. ఈసారి 17% పెంచి రూ.1.10 లక్షల కోట్లు ఇవ్వనున్నారు.
  • ప్రాధాన్య రంగానికి 14%, ప్రాధాన్యేతర రంగానికి 9% పెంపు కనిపిస్తోంది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు (ఎంఎస్‌ఎంఈలు) గతేడాది కంటే 12% పెంచి.. రూ.44,500 కోట్లను రుణాలుగా ఇవ్వనున్నారు.

ఇదీ చదవండీ.. అంత్యక్రియలకు చెల్లింపులపై అధికారుల్లో కొరవడిన స్పష్టత..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.