గుర్తుంచుకోండి.. ఓటు వేయటం అందరి బాధ్యత: ఎస్ఈసీ - sec nimmagadda updates
మున్సిపల్ ఎన్నికల్లో పట్టణవాసులు.. ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ పిలుపునిచ్చారు. ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.
![గుర్తుంచుకోండి.. ఓటు వేయటం అందరి బాధ్యత: ఎస్ఈసీ sec nimmagadda](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10929457-244-10929457-1615258124348.jpg?imwidth=3840)
ఎస్ఈసీ
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్
మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం ఉదయం రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ జరగనుంది. ప్రజలంతా పాల్గొనాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పిలుపునిచ్చారు. పట్టణ ప్రజలు ఓటు వేయటాన్ని తమ బాధ్యతగా గుర్తించుకోవాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియకు సర్వం సిద్ధం చేశామన్నారు.