ETV Bharat / city

'స్టైరీన్‌ ఎలా విడుదలైందో తేల్చలేదు' - ఎల్జీ పాలిమర్స్

ఎల్జీ పాలిమర్స్‌ దుర్ఘటన జరిగి నెల గడుస్తున్నప్పటికీ.. స్టైరీన్‌ ఏ గొట్టం నుంచి విడుదలైందో ఇప్పటికీ నిర్ధారించలేకపోయారని ప్రజల కోసం శాస్త్రవేత్తల (సైంటిస్ట్స్‌ ఫర్‌ పీపుల్‌) బృందం ఆక్షేపించింది.

vishaka-gas-leak
vishaka-gas-leak
author img

By

Published : Jun 10, 2020, 5:43 AM IST

ఎల్జీ పాలిమర్స్‌ దుర్ఘటన జరిగి నెల గడుస్తున్నప్పటికీ.. స్టైరీన్‌ ఏ గొట్టం నుంచి విడుదలైందో ఇప్పటికీ నిర్ధారించలేకపోయారని ప్రజల కోసం శాస్త్రవేత్తల (సైంటిస్ట్స్‌ ఫర్‌ పీపుల్‌) బృందం ఆక్షేపించింది. ట్యాంకు పైకప్పులో ఏ గొట్టాలు అమర్చారు? వాటికి అమర్చిన కవాటాలేవి? తదితర ప్రాథమిక అంశాలపై కూడా ఉన్నతస్థాయి కమిటీకి అవగాహన కొరవడిందని విమర్శించింది. ఈ కమిటీలో సమతుల్యత లేకపోవటం, పరిశ్రమ, భద్రతారంగ నిపుణులకు స్థానం లేకపోవటమే దీనికి ప్రధాన కారణమని పేర్కొంది. ఈ మేరకు బృందం ప్రతినిధి డాక్టర్‌ కె.బాబురావు, ఇతర సభ్యులు మంగళవారం ప్రకటన విడుదల చేశారు.

నివేదిక సమర్పణ గడువు పొడిగింపు
ఎల్జీ పాలిమర్స్‌ దుర్ఘటనపై విచారిస్తున్న ఉన్నత స్థాయి కమిటీ నివేదికను సమర్పించేందుకు గడువును ఈ నెల 22 వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులనిచ్చింది. అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరభ్‌కుమార్‌ ప్రసాద్‌ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ ఈ నెల 7నాటికి నివేదిక సమర్పించాల్సి ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.