ETV Bharat / city

తెలంగాణ : ప్రయాణికులు లేక తగ్గుతోన్న ఆర్టీసీ ఆదాయం - ఆర్టీసీ వార్తలు

తెలంగాణలో ప్రజా రవాణాకు కీలకమైన రహదారి రవాణా సంస్థ ప్రస్తుత విపత్తు వేళ తీవ్ర ఒడుదొడుకులను ఎదుర్కొంటోంది. లాక్‌డౌన్‌ సడలింపుల తర్వాత పెద్దసంఖ్యలో తెలంగాణ ప్రభుత్వం బస్సులు నడుపుతున్నా.. ప్రయాణికులు లేక రాబడి సగానికి సగం తగ్గింది. కేవలం 40 శాతం మాత్రమే ఆక్యుపెన్సీ రేషియో ఉండటం ఆదాయంపైనా ప్రభావం చూపుతోంది.

rtc-income-decreasing-due-the-corona-in-nalgonda-district
తగ్గుతోన్న తెలంగాణ ఆర్టీసీ ఆదాయం
author img

By

Published : Jul 7, 2020, 7:22 AM IST

తగ్గుతోన్న తెలంగాణ ఆర్టీసీ ఆదాయం

కొవిడ్ ప్రభావంతో అన్ని వ్యవస్థలూ కునారిల్లిన ప్రస్తుత తరుణంలో ఆ ప్రభావం ప్రజారవాణా వ్యవస్థ బాధ్యతలు మోస్తున్న తెలంగాణ ఆర్టీసీపైనా పడింది. మొత్తం బస్సుల్లో 60 శాతం రోడ్లెక్కినా... వస్తున్న ఆదాయం మాత్రం నామమాత్రంగానే ఉంటోంది. కరోనా వ్యాప్తి భయంతో జనం ప్రయాణాలు తగ్గించడం వల్ల రాబడికి భారీగా గండిపడుతోంది. నల్గొండ ఆర్టీసీ రీజియన్ 7 డిపోల పరిధిలో 750 బస్సులకు గాను 450 తిరుగుతున్నాయి. సగటున ఒక్కో బస్సులో 16 మంది మాత్రమే ప్రయాణిస్తున్నారు.

90 వేలకు తగ్గింది

నల్గొండ రీజియన్‌ పరిధిలో జూన్‌ నెల శుభకార్యాల వల్ల అంతో ఇంతో ఆదాయం సమకూరింది. కరోనా వ్యాప్తి, ఆషాఢ మాసం, వర్షాలరాకతో పొలం పనుల్లో రైతుల నిమగ్నమవడం వల్ల ప్రయాణికుల సంఖ్య క్రమంగా తగ్గిపోయింది. గతంలో మూడు లక్షల మంది ప్రయాణాలు సాగించగా... ఇప్పుడది 90 వేలకు తగ్గింది.

ఖర్చు తగ్గించుకోవడంపై దృష్టి

ఆదాయం పెంచుకోవడం, ఖర్చు తగ్గించుకోవడంపైనే తెలంగాణ ఆర్టీసీ అధికారులు దృష్టిసారించారు. బస్సుల నిర్వహణకు, సహాయ మెకానిక్‌లు, డీజిల్ ఆపరేటర్లు, టైపిస్టుల విధుల నుంచి పొరుగు సేవల సిబ్బందిని తప్పించి డిపోల పరిధిలో పనిచేస్తున్నవారికే బాధ్యతలు అప్పగిస్తున్నారు. డీజిల్ ధరల పెంపు తెలంగాణ ఆర్టీసీకి పెనుభారంగా మారింది. కార్గో సేవలను విస్తరించడం ద్వారా రానున్న రోజుల్లో ఆదాయం మరింత పెంచుకునేలా అధికారులు ప్రణాళికలు తయారు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

ఆర్టీసీ ఉద్యోగుల్ని కలవరపెడుతున్న కరోనా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.