ETV Bharat / city

"మీరేం చేసినా.. రాహుల్ గాంధీ వచ్చి తీరుతారు" - రాహుల్​ తెలంగాణ పర్యటన

Revanth on Rahul Tour: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనపై.. రగడ కొనసాగుతూనే ఉంది. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులతో రాహుల్ గాంధీ ఇంటరాక్ట్ అవుతారని, ఇందుకు అనుమతి ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు కోరగా.. ప్రభుత్వం అనుమతించలేదు. ఈ విషయమై తాజాగా.. పీసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా రాహుల్‌ గాంధీ ఉస్మానియా విశ్వవిద్యాలయంతోపాటు చంచల్‌గూడ కారాగారాన్ని సందర్శిస్తారని చెప్పారు.

author img

By

Published : May 2, 2022, 3:17 PM IST

Revanth on Rahul Tour: అక్రమ అరెస్టులు, నిర్బంధాలతో ఉద్యమాలను రాష్ట్రప్రభుత్వం నియంత్రించలేదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. రాహుల్‌ పర్యటన కోసం ప్రజాస్వామ్యయుతంగా అనుమతి కోసం ప్రయత్నించిన ఎన్‌ఎస్‌యూఐ నేతలను అరెస్టు చేయడంపై రేవంత్‌ మండిపడ్డారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా రాహుల్‌ గాంధీ ఉస్మానియా విశ్వవిద్యాలయంతోపాటు చంచల్‌గూడ కారాగారాన్ని సందర్శిస్తారని తేల్చిచెప్పారు. ఓయూకి కేంద్రం నుంచి నిధులు రాబట్టేందుకు రాహుల్​ గాంధీ పార్లమెంట్​లో నిలదీస్తారని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. ఓయూలో యూజీసీ నిధులు సరిగా వినియోగం అవుతున్నాయా.. ఓయూలో నియామకాలు సరిగా జరుగుతున్నాయా లేదా అని రాహుల్​ తెలుసుకుంటారన్నారు.

"మీరేం చేసినా.. రాహుల్ గాంధీ వచ్చి తీరుతారు"

తెలంగాణ రైతులకు అండగా ఉండాలని రాహుల్‌ గాంధీ నిర్ణయించుకున్నారని రేవంత్​ స్పష్టం చేశారు. తెలంగాణ పర్యటనకు రావాలని నిర్ణయం తీసుకున్నారన్నారు. ఓయూ విద్యార్థి నాయకులను రాహుల్‌ కలిసేందుకు అనుమతి ఇవ్వాలని రేవంత్​ డిమాండ్​ చేశారు. పోరాటానికి విద్యార్థులే ఆదర్శమన్నారు. పార్టీలకతీతంగా విద్యార్థి నాయకులు అరెస్టులను ఖండించాలని.. కేసీఆర్‌ నియంత పాలనపై తిరుగుబాటు చేయాల్సి ఉందన్నారు.

రాహుల్‌ గాంధీ ఉస్మానియా యూనివర్సిటీని సందర్శించి.. ఓయూ విద్యార్థులతో మమేకమవుతారు. యూజీసీ నిధులు సరిగా వినియోగం అవుతున్నాయా.. నియామకాలు సరిగా జరుగుతున్నాయా? లేదా? తెలుసుకుంటారు. పార్లమెంటు సమావేశాల్లో ఓయూ నిధుల విషయమై నిలదీస్తారు. ఓయూ సభకు అనుమతి అడిగినందుకు విద్యార్థి నాయకులను జైలులో పెట్టి అక్రమంగా కేసులు పెట్టారు. అక్రమ అరెస్టులు, నిర్బంధాల ద్వారా ప్రభుత్వం ఉద్యమాలను నియంత్రించలేదు. -రేవంత్​ రెడ్డి, టీపీసీసీ చీఫ్​

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.