గ్రామాల్లోనూ తప్పని ఇబ్బందులు: గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం పంపిణీ చేసే రేషన్ సరుకులు తీసుకునే వారు 85శాతం కంటే ఎక్కువమంది ఉండేవారు. కరోనా విస్తరిస్తున్న క్రమంలో వేలిముద్ర వేయడం ద్వారా వైరస్ వస్తుందన్న అనుమానంతో కొందరు సరకులు తీసుకోవడానికి వెనుకంజ వేస్తున్నారు. ఒకరోజు వ్యవధిలో వందల మంది వేలిముద్రలు వేయడం, సామాజికదూరం పాటిస్తూ మాస్కులు వేసుకుని వరుసలో నిలబడటం వంటి కారణాలతో కొందరు దూరంగా ఉన్నారు. పట్టణప్రాంతాల్లో కూడా కొన్నిచోట్ల ఇదే పరిస్థితి కొనసాగింది. గుంటూరు జిల్లాలో గ్రామీణ ప్రాంత మండలాలైన అమృతలూరు 73.26, కాకుమాను 74.32, పెదనందిపాడు 71.09, వట్టిచెరుకూరు 72.69శాతం మంది కార్డుదారులు మాత్రమే సరకులు తీసుకున్నారు. సింహభాగం మండలాల్లో 75నుంచి 76శాతంలోపు సరకులు పొందారు.
ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్నా కార్డుదారులు కొందరు తీసుకోవడానికి వెనుకంజ వేస్తున్నారు. కొందరైతే వేర్వేరు ప్రాంతాల్లో ఉండటంతో పోర్టబులిటీ సౌకర్యం ఉన్నప్పటికీ రావడం లేదు. కొందరు ఇళ్లకే పరిమితం కావడంతో చౌకదుకాణాలకు రావడం లేదు. వివిధ కారణాలతో ప్రతినెలా సగటున 15శాతం మంది కార్డుదారులు సరకులు తీసుకోవడానికి రాకపోయినా 85శాతం మంది తీసుకునేవారు అయితే జులైలో గుంటూరు జిల్లాలో 79.08, కృష్ణా జిల్లాలో 79.68శాతం మాత్రమే కార్డుదారులు సరకులు పొందడానికి కరోనా ప్రభావమేనని అధికారులు భావిస్తున్నారు. మంగళవారం నుంచి తొమ్మిదోవిడత రేషన్ సరకులు పంపిణీ ప్రారంభమవుతోంది. బియ్యం, కందిపప్పు ఉచితంగా అందిస్తారు. చక్కెరకు మాత్రం నగదు వసూలు చేస్తారు. కార్దుదారులందూ సామాజికదూరం పాటిస్తూ, మాస్క్‌లు ధరించి సరకులు తీసుకోవాలని పౌరసరఫరాలశాఖ అధికారులు కోరుతున్నారు.
జిల్లా చౌకధరల మొత్తం జులైలో సరకులు దుకాణాలు కార్డులు తీసుకున్నది
కృష్ణా 2353 13,15,887 10,48,500
గుంటూరు 2803 15,12,352 11,96,059
ఇదీ చదవండి: ఎన్నికలకు వెళ్లి ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం... 48 గంటల డెడ్లైన్: చంద్రబాబు