కొద్దిపాటి వర్షానికి నీరు చేరుతున్న ఉస్మానియా ఆస్పత్రిలో.. రోగుల బాధలు వర్ణణాతీతంగా మారాయి. తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న జోరువానకు ఉస్మానియా ఆస్పత్రిలోని కులీకుతుబ్ షా భవనంలోకి వర్షపు నీరు వచ్చి చేరింది. పెద్దమొత్తంలో వర్షపు నీరు చేరడం వల్ల రోగులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
పాత భవనాన్ని కూల్చివేసి కొత్తది నిర్మించాలంటూ కొద్దిరోజులుగా సిబ్బంది ఆందోళనకు దిగడం వల్ల స్పందించిన డీఎంఈ రమేశ్ రెడ్డి వెంటనే పాత భవనాన్ని ఖాళీ చేయాలని ఆదేశించారు. పాత భవనంలోని రోగులను పక్కనే ఉన్న మరో భవనానికి మార్చాలని సూచించారు. అయితే... ఉదయం నుంచి కురుస్తున్న జోరువానకు పక్కనే ఉన్న భవనంలోకి నీరు చేరింది.
ఇదీ చూడండి: స్వాతంత్య్ర దినోత్సవ మార్గదర్శకాలు జారీ.. ప్రత్యేక ఆహ్వానితులు వీరే..!