ETV Bharat / city

దశ 'దిశ'ల హర్షం.. మృగాలపై కానరాని సానుభూతి - priyanka reddy muder case updates

న్యాయం జరిగింది.. ఇలాగే కావాలి..  ఎక్కడ చూసినా ఇవే మాటలు. 'దిశ' కేసు నిందితుల ఎన్​కౌంటర్​పై సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు అందరూ దీనిపైనే చర్చ. దిశకు న్యాయం జరిగిందంటూ సామాజిక మాధ్యమ వేదికగా పోస్టింగ్​లు.. మృగాలకు సరైన శిక్ష వేశారంటూ పోలీసులకు జేజేలు. నిందితుల పట్ల వారి కుటుంబ సభ్యులు మినహా ఏ ఒక్కరూ కూడా కనీసం సానుభూతి వ్యక్తం చేయలేదంటే.. పాశవిక దాడిపట్ల ప్రజలు ఎంత భావోద్వేగానికి గురయ్యారో తెలుస్తోంది.

people-response-on-disha-accused-encounter
people-response-on-disha-accused-encounter
author img

By

Published : Dec 7, 2019, 6:53 AM IST

Updated : Dec 7, 2019, 6:59 AM IST

దశ 'దిశ'ల హర్షం.. మృగాలపై కానరాని సానుభూతి

దిశ పాశవిక హత్యాచార ఘటన.. దేశవ్యాప్తంగా అన్ని దిక్కుల ప్రజలను కదిలించింది. ప్రతి హృదయాన్ని స్పందించేలా చేసింది. అమ్మాయిని కాపాడలేకపోయారని పోలీసులపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజలు. నిందితులను బహిరంగంగా ఉరితీయాలని.. లేదా తమకు అప్పగించాలని అన్ని వర్గాల వారు డిమాండ్​ చేశారు. పోలీసులపై రాళ్ల దాడి చేశారు. పోలీస్​ స్టేషన్​లోకి చొచ్చుకుపోయేందుకు వెనుకాడలేదు. ప్రజాగ్రహం ఉవ్వెత్తున ఎగిసిపడిన క్షణాలవి.. అయితే ఎన్​కౌంటర్​ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అడుగడుగునా పోలీసులకు ప్రజలు నీరాజనం పలికారు. రాళ్లు వేసిన చేతులతోనే పూల వర్షం కురిపించారు. ఘటనా స్థలంలో నిందితులు విగత జీవులుగా పడి ఉన్న కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా వారిపై సానుభూతి వ్యక్తం చేయలేదు. కారణం వారి క్రూరత్వమే.

గతం కంటే భిన్నం..

సాధారణంగా ఎక్కడ ఎన్​కౌంటర్​ జరిగినా.. ప్రజాసంఘాలు, సామాజికవేత్తలు పెద్దఎత్తున నిరసన తెలుపుతారు. పోలీసులు, ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తారు. దిశ నిందితుల విషయంలో మాత్రం కనీసం పాపం అన్న వారే కనిపించలేదు. కొన్ని న్యాయపరమైన ప్రశ్నలు మినహా.. సర్వత్రా ప్రజామోదం లభించింది.

ఎన్​కౌంటర్​ జరిగిన ప్రాంతానికి పెద్దఎత్తున చేరుకున్న ప్రజలు పోలీసులపై పూలవర్షం కురిపించారు. పోలీసులు హాట్సాఫ్​ అంటూ జిందాబాద్​ కొట్టారు. దిశకు న్యాయం జరిగిందంటూ సామాన్యుల నుంచి ప్రముఖుల దాకా సామాజిక మాధ్యమ వేదికగా గొంతెత్తారు.

TG_HYD_01_07_NO_SYMPATHY_ON_ACCUSED_PKG_3064645 REPORTER: Nageshwara Chary ( ) దిశ హత్యాచారం ఘటన ప్రతీ హృదయాన్నీ కదిలించింది. అమ్మాయిని కాపాడలేక పోయారని పోలీసులపై ఆక్రోషం ఉప్పొంగింది. తమకు అప్పగించాలంటూ ఆగ్రహాన్ని ప్రదర్శించారు. పోలీసులపై రాళ్ల దాడికి పాల్పడి.. పోలీస్ స్టేషన్ లోకి చొచ్చుకెళ్లేందుకూ తెగించే స్థాయికి తీసుకెళ్లింది. కానీ ఎన్ కౌంటర్ తర్వాత అదే జనం.. పోలీసులకు నీరాజనం పలికారు. రాళ్లు వేసిన చేతులతో పూల వర్షం కురిపించారు. చెప్పులు విసిరిన ప్రజలే.. చప్పట్లతో అభినందించారు. నలుగురు నిందితులు మరణించినా.... ఎక్కడా సానుభూతి కనిపించడం లేదు. దానికి ప్రధాన కారణం... నిందితులు ప్రదర్శించిన క్రూరత్వమే. సత్వర న్యాయం కావాలని నినదించిన ప్రజానీకం ఆగ్రహం.. చల్లారింది. look వాయిస్ ఓవర్: ఎన్ కౌంటర్ లో మరణించిన నలుగురు నిందితుల పట్ల ఎక్కడా సానుభూతి కనిపించలేదు. ఘటనపై అక్కడక్కడ న్యాయపరమైన ప్రశ్నలు తలెత్తినప్పటికీ... నిందితుల విషయంలో మాత్రం పాపం అన్న వారే కనిపించలేదు. మానవత్వం మంట కలిసినట్లుగా నిందితులు ప్రవర్తించిన తీరు.. ప్రజల్లో కోపం కట్టలు తెగిపోయేలా చేసింది. ఆనాడు దిశ హత్యాచారం వెలుగులోకి రాగానే.. జనం చలించిపోయారు. పశువుల్లా అమాయకురాలిని పొట్టనబెట్టుకున్నారంటూ తీవ్రంగా స్పందించారు. యువతిని కాపాడ లేకపోయారన్న ఆగ్రహంతో ఊగిపోయారు. సామాజిక మాధ్యమాల్లో తమ కసినంతా చూపించారు. సత్వర న్యాయం జరగాలని గళమెత్తారు. పోలీసులపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. నిందితులను తమకు అప్పగించాలంటూ.. పోలీస్ స్టేషన్ లోకి దూసుకెళ్లేందుకూ తెగించారు. సత్వర కఠిన శిక్షలు పడితేనే.. మరో మహిళకు ఇలాంటి అన్యాయం జరగదన్న భావన ప్రజల్లో కనిపించింది. పది రోజుల్లో పరిస్థితి పూర్తిగా భిన్నంగా కనపించింది. ఎన్ కౌంటర్ ఘటన వద్దకు గుంపులుగా చేరుకున్న జనం... పోలీసులకు నీరాజనం పట్టారు. పోలీసులపై పూల వర్షం కురిపించారు. పోలీసులకు హాట్సాఫ్ అంటూ అబినందనలు తెలిపారు. న్యాయం జరిగిందంటూ అతి సామాన్యుల నుంచి ప్రముఖుల వరకూ వివిధ రూపాల్లో స్పందన వ్యక్తం చేశారు. ఎన్ కౌంటర్లపై గతంలో ఎక్కడా ఎప్పుడూ కనిపించని ప్రజా స్పందన... ఇక్కడ కనిపించిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. న్యాయ పరమైన ప్రక్రియ పరంగా అక్కడక్కడ భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ... నిందితులను పాపం అని సానుభూతి చూపిన వారే కనిపించలేదు. end
Last Updated : Dec 7, 2019, 6:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.