రైతుల పట్ల ప్రభుత్వ వైఖరిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రైతులకు మేలు చేయకుంటే మీకున్న 151 మంది ఎమ్మెల్యేలు ఎందుకని ప్రశ్నించారు. మచిలీపట్నం ర్యాలీలో మాట్లాడిన ఆయన... వరద బాధిత రైతులకు రూ. 35వేలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. మద్యంపై వచ్చే ఆదాయాన్ని రైతుల సంక్షేమానికి కేటాయించాలన్నారు. తప్పులు సరిదిద్దుకునేందుకు ప్రభుత్వానికి సమయం ఇస్తున్నామని హెచ్చరించారు. వరద బాధిత రైతులకు తక్షణమే రూ. 10వేలు విడుదల చేయాలన్నారు.
'రైతులకు పరిహారం చెల్లించకపోతే అసెంబ్లీ ముట్టడి తప్పదు. వైకాపా నేతలు.. వకీల్ సాబ్ వచ్చాడనే విషయాన్ని మీ సీఎంకు చెప్పండి. వైకాపా నేతలు వ్యాపారం చేసుకోవచ్చు.. మేం సినిమాలు చేయకూడదా? వైకాపా నేతలు పేకాట క్లబ్బులు నడిపిస్తూ రాజకీయాలు చేస్తున్నారు. సీఎం జగన్‌కు పరిశ్రమలు లేవా.. వ్యాపారాలు లేవా..?మైనింగ్, ఇసుక దందాలకేనా 151 మంది వైకాపా ఎమ్మెల్యేలు ఉన్నారు. సినిమాలు చేస్తూ రాజకీయాలు చేస్తున్నామని విమర్శిస్తున్నారు. మరీ వైకాపా నేతలు చేస్తున్నదేంటి...దేశసేవా...?- పవన్ కల్యాణ్, జనసేన అధినేత
రాష్ట్ర ఉత్పత్తిలో 40శాతం రైతు నుంచే వస్తోందని పవన్ కల్యాణ్ అన్నారు. రైతులు కన్నీరు కారుస్తుంటే అడగకూడదా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. అసెంబ్లీ సమావేశాలలోపు రైతులకు రూ.35వేలు ఇవ్వకపోతే... శాసనసభను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. సమావేశాలు విశాఖ, విజయవాడ లేదా పులివెందులలో ఎక్కడ నిర్వహించినా.. తమ అసెంబ్లీ ముట్టడిని ఆపలేరని హెచ్చరించారు. తాము అసెంబ్లీ ముట్టడిస్తే ఏదైనా జరగవచ్చని స్పష్టం చేశారు. మంత్రి పదవిని కాపాడుకునేందుకు తనపై మంత్రి పేర్ని నాని విమర్శలు చేస్తున్నారని అన్నారు. తుపాన్‌తో రైతులు నష్టపోతే మంత్రి నాని ఒక్కరికైనా వెయ్యి రూపాయలు ఇచ్చారా అని నిలదీశారు.
రాష్ట్రం సుభిక్షం కోరుకునే జనసేన పార్టీ పెట్టాను. ఎన్నికల్లో ఒటమి చెందినా నేను వెనకడుగు వేయలేదు. రాజకీయం అంటే కుటుంబం, కులానిదో కాదు..అన్ని కులాలు, కుటుంబాలది. వైసీపీలో నానిలు ఎక్కువ... శతకోటి నానిలో ఓ నాని ఇక్కడి ఎమ్మెల్యే. వైకాపా నేతలు.... వకీల్ సాబ్ వచ్చాడని...మీ సీఎం సాబ్‌కు చెప్పండి - పవన్ కల్యాణ్, జనసేన అధినేత
కలెక్టరేట్‌లో వినతిపత్రం
-
కృష్ణా జిల్లా కలెక్టరేట్ లో జిల్లా రెవెన్యూ అధికారికి వినతిపత్రం సమర్పిస్తున్న జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. (2/2)#JSPStandsWithFarmers pic.twitter.com/SpmKWDCYdK
— JanaSena Party (@JanaSenaParty) December 28, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">కృష్ణా జిల్లా కలెక్టరేట్ లో జిల్లా రెవెన్యూ అధికారికి వినతిపత్రం సమర్పిస్తున్న జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. (2/2)#JSPStandsWithFarmers pic.twitter.com/SpmKWDCYdK
— JanaSena Party (@JanaSenaParty) December 28, 2020కృష్ణా జిల్లా కలెక్టరేట్ లో జిల్లా రెవెన్యూ అధికారికి వినతిపత్రం సమర్పిస్తున్న జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. (2/2)#JSPStandsWithFarmers pic.twitter.com/SpmKWDCYdK
— JanaSena Party (@JanaSenaParty) December 28, 2020
మచిలీపట్నం కలెక్టరేట్‌లో పవన్ కల్యాణ్ వినతిపత్రం అందజేశారు. కలెక్టర్ ఇంతియాజ్ అందుబాటులో లేకపోవడంతో డీఆర్‌వోవెంకటేశ్వర్లుకు వినతిపత్రం ఇచ్చారు. నివర్ తుపాను వల్ల పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.35 వేలు పరిహారం ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పరిహారం పెంచాలని తెలిపారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం విరమించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
ఇదీ చదవండి