ETV Bharat / city

వైకాపా ప్రభుత్వానికి ఆర్థిక ప్రణాళికలో స్పష్టత లేదు: నాదెండ్ల

author img

By

Published : May 20, 2021, 7:34 PM IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్​పై జనసేన పార్టీ విమర్శలు గుప్పించింది. హంగామా తప్ప రాష్ట్రాభివృద్ధి లేదని ఆ పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. ఈ ప్రభుత్వానికి ఆర్థిక ప్రణాళికలో స్పష్టత లేదని దుయ్యబట్టారు. కరోనా నియంత్రణ, థర్డ్ వేవ్​ను ఎదుర్కొనేందుకు సన్నద్ధత, ఆసుపత్రుల్లో మౌలిక వసతుల కల్పనపై రోడ్ మ్యాప్ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

నాదెండ్ల మనోహర్
నాదెండ్ల మనోహర్

వైకాపా ప్రభుత్వం 2.29 లక్షల కోట్ల రూపాయలతో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్​లో అంకెల హంగామా తప్ప రాష్ట్రాభివృద్ధి, వైద్య రంగంలో మౌలిక వసతుల కల్పన, ప్రజారోగ్యంపై దృష్టి సారించలేదని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు. కొవిడ్‌ విజృంభిస్తున్న సమయంలో వ్యవసాయ బడ్జెట్ తరహాలోనే ఆరోగ్య శాఖ నుంచి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టి కరోనా నియంత్రణ, థర్డ్ వేవ్​ను ఎదుర్కొనేందుకు సన్నద్ధత, ఆసుపత్రుల్లో మౌలిక వసతుల కల్పనపై రోడ్ మ్యాప్ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

ఆరోగ్య రంగానికి కేవలం వెయ్యి కోట్లు ప్రతిపాదించి గతేడాది కంటే ఎక్కువ ఇచ్చామని చెబుతున్న వైకాపా ప్రభుత్వ చిత్తశుద్ధి ఏంటో అర్థమవుతోందని.. మనోహర్ విమర్శించారు. ముఖ్యమంత్రి ఒకసారి తన ఇంటి నుంచి బయటకు కదిలి ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తే కరోనా బాధితుల వేదన, ప్రజల భయాందోళనలు అర్థం అవుతాయని వ్యాఖ్యానించారు. కరోనా నియంత్రణలో దేశానికే రాష్ట్రాన్ని ఆదర్శంగా చేశామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం.. రోగులు ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లకుండా ఎందుకు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తున్నారో చెప్పాలని నిలదీశారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరత తీవ్రంగా ఉందన్న నాదెండ్ల.. ఏడాది కాలంగా ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నా పన్నులు సక్రమంగా చెల్లించారని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ రాబడి ఎక్కడా తగ్గలేదని స్పష్టం చేశారు. ఇంత ఆదాయం వస్తున్నా ప్రభుత్వం ఎందుకు ఆస్తులు ఆమ్ముకోవాలని చూస్తోందని నిలదీశారు. తీసుకున్న అప్పులపై నెలకు రూ.2వేల కోట్లు వడ్డీలే చెల్లిస్తున్నారని మండిపడ్డారు. ఈ ప్రభుత్వానికి ఆర్థిక ప్రణాళికలో స్పష్టత లేదని దుయ్యబట్టారు.

రహదారుల, రవాణా కోసం గత బడ్జెట్లోనూ రూ.6,200 కోట్లు నిధులు కేటాయించారని.. వాటితో రాష్ట్రంలో ఎక్కడైనా రహదారులను అభివృద్ధి చేశారా అని నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలకు బడ్జెట్​లో ఇచ్చే నిధులు నీటి మీద రాతల్లా ఉన్నాయని మండిపడ్డారు. సంక్షేమ బడ్జెట్ 32 శాతం పెంచామంటూ అభూత కల్పనతో హడావిడి చేస్తూ.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సమగ్ర అభివృద్ధి విషయాన్ని పక్కకు నెట్టేశారని విమర్శించారు. కిందటి బడ్జెట్​లో ఇచ్చిన నిధులను నవ రత్నాలకు మళ్లించారని ఆరోపించారు. బడ్జెట్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా లేదని విమర్శించారు.

ఇదీ చదవండీ... స్టేట్​లో ఫస్ట్​టైం: గుంటూరు జిల్లాలో రెమిడిసివిర్ తయారీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.