ఎన్ఫోర్స్మెంట్ పవర్స్ ఇక స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోకి.. - ఎన్ఫోర్స్మెంట్ పవర్స్ ఇక స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోకి
ఇప్పటి వరకు ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్న విధులను స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో చేయనుంది. ఈ మేరకు ప్రభుత్వం ఎక్సైజ్ స్టేషన్లను ఎస్ఈబీ పరిధిలోకి తీసుకువస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

మద్యం, ఇసుక అక్రమాల నిరోధానికి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోకి సిబ్బందిని కేటాయించారు. ఎక్సైజ్ శాఖకు చెందిన 70 శాతం ఉద్యోగులు, సిబ్బందిని ఎస్ఈబీకి బదలాయించారు. దీంతో కేవలం 30 శాతం సిబ్బంది, ఉద్యోగులతోనే ఎక్సైజ్ శాఖ పని చేయనుంది.
ఎక్సైజ్-ఎస్ఈబీ మధ్య కేడర్ పోస్టుల నుంచి ఔట్ సోర్సింగ్ సిబ్బంది వరకు విభజన చేయనున్నారు. ప్రస్తుతం 6,274 పోస్టులకు గాను, ఎక్సైజ్ శాఖకు 1881, ఎస్ఈబీకి 4,394 పోస్టులు కేటాయించారు.
ప్రస్తుతం ఎక్సైజ్ శాఖలో సిబ్బందిని 70:30 ప్రాతిపదికన ఎస్ఈబీ-ఎక్సైజ్ శాఖకు కేటాయింపులు జరిపారు.
ఎక్సైజ్ శాఖకు ఉన్న ఎన్ఫోర్స్మెంట్ విధులన్నీ ఎస్ఈబీకి బదలాయించారు. 208 ఎక్సైజ్ స్టేషన్లను ఎస్ఈబీ పరిధిలోకి తీసుకొస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇదీ చదవండి: వలస వెతలు: నడినెత్తిన మంటలు.. పొట్టలో ఆకలి దప్పులు..