ETV Bharat / city

NEET EXAM : నీట్‌ పీజీ ర్యాంకుల విడుదల.. ధ్రువపత్రాల పరిశీలన ఎప్పుడంటే? - నీట్‌ పీజీ-2021 ప్రవేశ పరీక్ష ఫలితాలు

నీట్‌ పీజీ-2021 ప్రవేశ పరీక్షకు సంబంధించిన ర్యాంకులు విడుదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 7,267 మంది విద్యార్థుల ర్యాంకులు, వారికి వచ్చిన మార్కుల స్కోర్‌ను డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌లో గురువారం రాత్రి ఉంచారు.

NEET EXAM Result
NEET EXAM Result
author img

By

Published : Oct 22, 2021, 9:47 AM IST

నీట్‌ పీజీ-2021 ప్రవేశ పరీక్షకు సంబంధించిన ర్యాంకులు విడుదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 7,267 మంది విద్యార్థుల ర్యాంకులు, వారికి వచ్చిన మార్కుల స్కోర్‌ను ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌లో గురువారం రాత్రి ఉంచారు. జాతీయ స్థాయిలో జరిగిన ప్రవేశ పరీక్షలో రాష్ట్రానికి చెందిన ఆరుగురు విద్యార్థులు టాప్‌ 100లోపు ర్యాంకులు సాధించారు.

ధరణికోట భానుచంద్‌ 21, లక్కిరెడ్డి వెంకట్‌ భరత్‌కుమార్‌రెడ్డి 42, జొన్నలగెడ్డ శ్రీవిశ్వశ్రేయ 48, బోనం హర్షిత 66, వి.ఆర్‌.శ్రీచరణ్‌ 76, దుగ్డిరెడ్డి చిట్టి సువర్ణ 98వ ర్యాంకును సాధించారు. నీట్‌ పీజీలో వెయ్యి లోపు ర్యాంకులు సాధించిన ఏపీ విద్యార్థులు 60 మంది ఉన్నారు. రెండు వేల లోపు ర్యాంకులొచ్చిన వారు 108 మంది, మూడు వేలలోపు 177 మంది ఉన్నారు.

ఎన్టీఆర్‌ విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌లో ఉంచిన జాబితాలో మొదటి ర్యాంకు 21, చివరి ర్యాంకు 1,00,023. కటాఫ్‌గా జనరల్‌ కేటగిరీకి 302, వికలాంగుల కేటగిరీకి 283, బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 265 మార్కులను నిర్ణయించారు. అయితే.. ఇది తుది జాబితా కాదని, విద్యార్థుల ధ్రువీకరణ పత్రాలు పరిశీలించిన తర్వాత తుది జాబితాను విడుదల చేస్తామని చెప్పారు. త్వరలో ధ్రువీకరణ పత్రాల పరిశీలన కోసం నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్లు వర్సిటీ అధికారులు వెల్లడించారు.

ఇదీ చదవండి : HC ON GO 55: డిగ్రీ కళాశాలల్లో సీట్ల కేటాయింపుపై స్టే పొడిగింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.