ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనతో భయాందోళనకు గురైన ప్రజలకు... ప్రభుత్వం పునరావాసం కల్పించలేకపోయిందని... తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చీకటి పడకముందే ఇంటికి వెళ్లి పడుకున్నారని మండిపడ్డారు. ప్రజలేమో నడిరోడ్డుపై జాగారం చేయాల్సి వచ్చిందంటూ ఓ వీడియోను తన ట్విటర్లో పోస్ట్ చేశారు.
ఇదీచదవండి.