ETV Bharat / city

ఆ ఏటీఎంలో రూ.100 తీస్తే 500.. రూ.వెయ్యి తీస్తే 5 వేలు..! - అమరావతి వార్తలు

ఏటీఎంకు వెళ్లి డబ్బులు డ్రా చేస్తుండగా రూ.100 డ్రా చేస్తే రూ.500 వచ్చాయి. ఇంకో వ్యక్తికి రూ.వెయ్యి డ్రా చేస్తే రూ.5 వేలు వచ్చాయి. ఎన్నిసార్లు చేసినా డబ్బులు వస్తూనే ఉన్నాయి. ఇలా ఉచితంగా డబ్బులు వస్తే ఎవరు కాదనుకుంటారు? అందుకే ఒక్కసారిగా డబ్బులు రావడంతో తెలంగాణలోని ఆ ఏటీఎం వద్ద జనాలు బారులు తీరారు. ఇంతకీ విషయమేంటంటే..!

atm working wrong in telangana
ఆ ఏటీఎంలో రూ.100 తీస్తే 500.. రూ.వెయ్యి తీస్తే 5 వేలు
author img

By

Published : May 16, 2021, 12:24 PM IST

ఆ ఏటీఎంలో రూ.100 తీస్తే 500.. రూ.వెయ్యి తీస్తే 5 వేలు..!

తెలంగాణలోని వనపర్తి జిల్లా అమరచింత మండల కేంద్రంలోని ఓ ఏటీంలో రూ.100 డ్రా చేస్తే 500 వచ్చాయి. రూ.వెయ్యి డ్రా చేస్తే రూ.5 వేలుచ్చాయి. మూడు రోజులుగా ఇదే జరగుతున్నా.. అందరూ రహస్యంగా ఉంచారు. శనివారం ఉదయం ఈ విషయం తెలిసి ఏటీఎం వద్ద జనం బారులు తీరారు. లాక్​డౌన్ అమల్లో ఉన్నా జనం గుంపులుగా ఎందుకున్నారని పోలీసులు ఆరా తీయగా అసలు విషయం బైట పడింది. వెంటనే ఏటీఎంను మూసేసి... నిర్వాహకులకు సమాచారం అందించారు.

సాంకేతిక లోపం కారణంగా అదనంగా డబ్బులు వచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. రూ.100 నోట్ల స్థానంలో రూ.500 నోట్లు పెట్డడం వల్ల ఈ తప్పిదం జరిగినట్లుగా తెలుస్తోంది. మొత్తం రూ. 5 లక్షల 88వేలు అదనంగా డ్రా అయినట్లుగా నిర్వాహకులు చెబుతున్నారు. ఏటీఎంలో నగదు జమ చేసినప్పటి నుంచి ఏ ఖాతా నంబర్ల నుంచి డబ్బులు డ్రా చేసుకున్నారో గుర్తించి... రికవరీ చేసేలా చర్యలు తీసుకుంటామని నిర్వాహకులు తెలిపారు.

ఇదీ చదవండి:

కొవిడ్​ రోగులు బయటకొస్తున్నారు.. బీ కేర్ ఫుల్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.