రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోన్న రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఉపసంహరించుకోవాలని తెలంగాణకు చెందిన మంత్రి జగదీశ్‌రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణకు ద్రోహం చేసేలా ఏపీ ప్రాజెక్టు పనులు చేపడుతోందని మండిపడ్డారు. ఎత్తిపోతల పథకంపై గ్రీన్ ట్రైబ్యునల్ ఇచ్చిన స్టేను ధిక్కరించి ముందుకెళ్లిందని ధ్వజమెత్తారు.
ఎత్తిపోతల పథకంపై కేంద్ర ప్రభుత్వం, అపెక్స్ కమిటీ దృష్టికి తెచ్చాం. ఎత్తిపోతల పథకంపై గ్రీన్ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించగా స్టే వచ్చింది. గ్రీన్ ట్రైబ్యునల్ స్టేను ధిక్కరించి ఏపీ ముందుకెళ్లింది. ఏపీ కోర్టు ధిక్కరణకు పాల్పడిందని కేసు వేశాం. కేవలం సర్వే జరుగుతోందని ఏపీ ప్రభుత్వం కప్పిపుచ్చుకుంది. అనుమతులు వచ్చిన తర్వాతే పనులు చేస్తామని చెప్పింది. తెలంగాణకు ద్రోహం చేసే విధంగా ఏపీ ప్రాజెక్టు పనులు చేపడుతోంది.- తెలంగాణమంత్రి జగదీశ్‌రెడ్డి
ఏపీలో అనుమతులు లేకుండా ప్రాజెక్టులు చేపడుతున్నారని గతంలో సీఎం కేసీఆర్ పోరాడారని జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 300కు పైగా టీఎంసీల సామర్థ్యంతో ప్రాజెక్టులకు వ్యూహం పన్నారని తెలిపారు. ఏపీ అక్రమ ప్రాజెక్టులపై నాటి యూపీఏ ప్రభుత్వం దృష్టికి కేసీఆర్ తెచ్చారన్న ఆయన.. అభ్యంతరాలపై వైఎస్సార్, కేసీఆర్‌ను దిల్లీకి పిలిపించి సోనియా మాట్లాడారన్నారు. సోనియా ఆదేశాల మేరకు ప్రాజెక్టులపై వైఎస్సార్ వెనక్కి తగ్గారని తెలిపిన మంత్రి.. వైఎస్సార్ కుట్రలకు కాంగ్రెస్ నాయకులు సాక్ష్యులని వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి: