ఓ స్థిరాస్తి వ్యాపార సంస్థ కార్యాలయం ప్రారంభించేందుకు వెళ్లిన తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి(Indrakaran reddy stuck in lift) ఊహించని రీతిలో లిఫ్ట్‌లో ఇరుక్కుపోయారు. ఒక్కసారిగా లిఫ్ట్ ఆగిపోవడంతో కాసేపు అందరూ ఆందోళన చెందారు. వెంటనే స్పందించిన పోలీసులు లిఫ్ట్‌ను(lift break) చాకచక్యంగా తెరిచి మంత్రితో పాటు ఓ ఎమ్మెల్యే, ఇద్దరు కార్పొరేటర్లను బయటకు తీశారు. ఈ సంఘటన హైదరాబాద్‌లోని మియాపూర్ అల్విన్ కాలనీ కూడలి వద్ద జరిగింది.
మంత్రిని సురక్షితంగా బయటకు తీయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆల్విన్ కాలనీ కూడలి వద్ద ఓ రియల్ ఎస్టేట్ కార్యాలయం ప్రారంభోత్సవానికి మంత్రితోపాటు ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీ (arikepudi gandhi), ఇద్దరు కార్పొరేటర్లు హాజరయ్యారు. వీరంతా ఆ కార్యాలయంలోని పై అంతస్తుకు లిఫ్ట్‌లో వెళ్తుండగా ఒక్కసారిగా ఆగిపోయింది. పోలీసులు లిఫ్ట్‌ను చాకచక్యంగా తెరవడంతో అందరూ సురక్షితంగా బయటపడ్డారు.
ఇదీ చూడండి: