ETV Bharat / city

పవన్ ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకోబోం: బొత్స - ఏపీలో ఇసుక కొరత వార్తలు

సీఎం జగన్ గురించి పవన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి బొత్స తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అసహనంతో మాట్లాడితే సహించేదిలేదని హెచ్చరించారు. కార్మికుల పిల్లలు ఆంగ్ల విద్యను అభ్యసిస్తే... పవన్​కు కడపుమంట ఎందుకని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇసుక కొరతపై తెదేపా, జనసేన చేసే విమర్శలకు అర్ధం లేదన్నారు

minister bosta fire on pawan kalyan over controversal comments on cm jagan
author img

By

Published : Nov 13, 2019, 5:55 PM IST

Updated : Nov 13, 2019, 10:19 PM IST

అక్రమ రవాణా జరిగినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధం

సీఎం జగన్ గురించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ సహనం కోల్పోతున్నారని విమర్శించారు. ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని... అలాంటి వ్యాఖ్యలను సహించేది లేదన్నారు. అన్ని వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకురావటమే లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే... అసహనంతో, అక్రోశంగా ఎందుకు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. కార్మికుల పిల్లలు ఆంగ్ల విద్యను అభ్యసిస్తే పవన్​కు కడపుమంట ఎందుకని ప్రశ్నించారు.

ఇంగ్లీషు పై పట్టు అవసరం

ఆంగ్లంపై పట్టు అవసరం...
ఆంగ్ల భాషపై పట్టు అవసరమని మంత్రి బొత్స వివరించారు. తాను కూడా ఆంగ్లంపై పట్టులేక వ్యక్తిగతంగా చాలా ఇబ్బందిపడుతున్నాని వ్యాఖ్యానించారు. మాతృభాషపై అందరికీ ప్రేమ ఉంటుందని... కానీ జీవన విధానంతో పరిస్థితులను మార్చుకోవాలన్నారు.

ఇసుక దీక్ష కాదు..కొంగ దీక్ష

ఇసుకపై లేనిపోని ఆరోపణలు...
ఇసుక కొరతపై తెదేపా, జనసేన లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరు పార్టీల వ్యవహారశైలి ఒకేలా ఉందని వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వంలో ఉచితంగా ఇసుక పంపిణీ చేశామని తెదేపా నేతలు చెప్పడం సిగ్గుచేటన్నారు. ఉచితంగా ఇసుక పంపిణీ చేసినట్లు నిరూపిస్తే... తల దించుకుంటానని సవాల్ విసిరారు. తెదేపా అధినేత చంద్రబాబు తలపెట్టిన ఇసుక దీక్ష... కొంగ దీక్ష అని ఎద్దేవా చేశారు. అంతా బాగా చేశామని చెబుతున్న తెదేపా నేతలు... మొన్నటి ఎన్నికల్లో కేవలం 23 సీట్లకే ఎందుకు పరిమితమయ్యారని ప్రశ్నించారు.

మూడు పెళ్లిళ్లు వాస్తవమే కదా...

మూడు పెళ్లిళ్లు వాస్తవమే కదా...
పవన్ మూడు పెళ్లిళ్ల గురించి సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి బొత్స స్పందించారు. పవన్ మూడు పెళ్లిళ్లు వాస్తవమే కదా అని అన్నారు. అది వ్యక్తిగతం కాదని అభిప్రాయపడ్డారు. ఆయన పిల్లలు ఎక్కడ చదువుతున్నారని... సీఎం అడిగింది వాస్తవమే కదా నిలదీశారు. ఈ అంశాన్ని వివాదాస్పదం చేయాల్సిన అవసరం లేదన్నారు.

పరస్పర అంగీకారంతోనే రద్దు నిర్ణయం

అంకుర ప్రాజెక్టు వల్ల రాజధాని అమరావతికి కలిగే ఉపయోగం ఏమిటనే తమ ప్రశ్నకు... సింగపూర్ ప్రతినిధులు సరైన సమాధానం ఇవ్వలేదని మంత్రి బొత్స చెప్పారు. అందుకే ప్రభుత్వంతో వారికున్న ఒప్పందాన్ని పరస్పర అంగీకారంతో రద్దు చేసుకున్నామని వివరించారు. సింగపూర్ ప్రతినిధులు రాసిన లేఖను పూర్తిగా చదవకుండానే చంద్రబాబు, లోకేష్ ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

పవన్ మీ మాటలు సరికాదు : బొత్స

రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని వ్యతిరేకించటమే పనిగా పెట్టుకుంటున్నాయని మంత్ర బొత్స మండిపడ్డారు. ఒక రాజకీయ విధానం లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. వైకాపా నేతలు ఇసుక అక్రమాలకు పాల్పడుతున్నారన్న వ్యాఖ్యలపై కూడా బొత్స మాట్లాడారు. తమ విజయనగంలో ఏ ఒక్క నాయకుడైనా అక్రమాలకు పాల్పడినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమేనని విపక్షాలకు సవాల్ విసిరారు. కర్నూలు వేదికగా పాదయాత్ర సమయంలో తప్పు చేసిన వారిని నడిరోడ్డు మీదే కాల్చి చంపాలని... జగన్ చేసిన వ్యాఖ్యలపై బొత్స స్పష్టతనిచ్చారు. ఏ ఒక్కరినో ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదని... జగన్ మాటాల్లోని భావాన్ని గ్రహించాలి కానీ చెడు అర్ధాలు తీయెుద్దన్నారు.

ఇదీ చదవండి : వెంటిలేటర్​పై గాయని లతా మంగేష్కర్

Last Updated : Nov 13, 2019, 10:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.