ETV Bharat / city

'అప్పుడు ముద్దులు పెట్టి.. ఇప్పుడు పిడిగుద్దులు గుద్దుతున్నారు' - లోకేష్​ ట్విట్టర్​ తాజా వార్తలు

పాదయాత్రలో ముద్దులు పెట్టిన ముఖ్యమంత్రి జగన్​ ఇప్పుడు పిడిగుద్దులు గుద్దుతున్నారని తెదేపా ఎమ్మెల్సీ లోకేశ్​​ ధ్వజమెత్తారు. పేదల భూములు లాక్కొని తిరిగి పేదలకే అమ్మడం సీఎం రివర్స్​ టెండరింగ్​ మార్క్​ అని మండిపడ్డారు.

పాదయాత్రలో ముద్దులు పెట్టి ఇప్పుడు పిడిగుద్దులు గుద్దుతున్నారు

author img

By

Published : Jul 9, 2020, 9:57 AM IST

తెదేపా హయాంలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో నిర్మించుకున్న గుడిసెలను కూల్చివేస్తున్నారంటూ తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్​‌ మండిపడ్డారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో తెదేపా హయాంలో ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో నిర్మించుకున్న గుడిసెలను కూల్చివేయడం సీఎం జగన్​ అహంకార ధోరణికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాదయాత్రలో పేదలకు ముద్దులు పెట్టి.. ఇప్పుడు పిడిగుద్దులు గుద్దుతున్నారని విమర్శించారు.

పేదల భూములను లాక్కొని తిరిగి పేదలకే అమ్మడం సీఎం రివర్స్​ టెండర్​ మార్క్​ అని లోకేశ్​ ఎద్దేవా చేశారు. 'మీకు రాజప్రాసాదాలు కావాలి కానీ పేదవాడికి గుడిసె వేసుకునే హక్కు లేదా' అంటూ ప్రశ్నించారు.

ఇదీ చదవండి:

'రాత్రి పబ్​జీ ఆడతారు... పొద్దున్నే ప్రజలపై పడతారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.