ETV Bharat / city

'తెలంగాణలో.. ఆ సమయంలో మద్యం దుకాణాలు తెరిచి ఉంటాయి' - తెలంగాణ వార్తలు

రేపటి నుంచి తెలంగాణలో లాక్​డౌన్​ అమల్లోకి రానుండగా.. ఉదయం 6 గంటల నుంచి 10 వరకు మద్యం దుకాణాలు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు అబ్కారీ శాఖకు మౌఖిక ఆదేశాలు జారీ అయ్యాయి.

wine shops open times in telangana
లాక్​డౌన్​లో మద్యం దుకాణాల సమయం
author img

By

Published : May 11, 2021, 9:14 PM IST

తెలంగాణలో లాక్‌డౌన్‌ నేపథ్యంలో మద్యం దుకాణాల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మద్యం దుకాణాలు తెరచుకునేందుకు వెసులుబాటు కల్పించింది. ఈమేరకు అబ్కారీ శాఖకు ప్రభుత్వం మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. అబ్కారీ శాఖ నిబంధనల ప్రకారం బార్‌ అండ్‌ రెస్టారెంట్లు, మద్యం దుకాణాలు ఉదయం 10 గంటలలోపు తెరిచేందుకు అవకాశం లేదు.

మరోవైపు.. ఉదయం 10గంటల తర్వాత లాక్‌డౌన్‌ నిబంధనలు అమల్లోకి వస్తాయి. ఈ నేపథ్యంలో.. అబ్కారీశాఖ అధికారులు మద్యం దుకాణాలను తెరిచే అంశంపై ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూడగా.. నిబంధనలను సడలించినట్టు మౌఖిక ఆదేశాలు వెలువడ్డాయి. ఉదయం 6 నుంచి 10 గంటలవరకు మాత్రమే కార్యకలాపాలకు అవకాశమిచ్చింది ప్రభుత్వం. ఆ తర్వాత లాక్‌డౌన్‌ నిబంధనలు అమల్లోకి వస్తాయి.

ఇదీ చదవండి:

ఏపీలో మరో 20,345 కరోనా కేసులు, 108 మరణాలు నమోదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.