ETV Bharat / city

ఆర్టీసీ భారీ వాహనాల డ్రైవింగ్‌ శిక్షణ...ఆసక్తి చూపుతున్న యువత - ఆర్టీసీ డ్రైవింగ్ స్కూళ్లు

దశాబ్దాల అనుభవం కలిగిన వారితో శిక్షణ. డ్రైవింగ్‌తో పాటు మెకానిక్‌ మెలకువలపైనా బోధన. అదీ పూర్తయ్యాక సులభంగా లైసెన్స్‌ జారీ. ఆర్టీసీ డ్రైవర్ల నియమకాల్లోనూ ప్రాధాన్యం. ఆర్టీసీ ప్రారంభించిన సరికొత్త శిక్షణా కార్యక్రమంలో నిరుద్యోగ యువకులను ఊరిస్తున్న అంశాలివి. మెరుగైన, స్థిరమైన ఉపాధి అవకాశాల దిశలో ఈ శిక్షణ వారిలో ఆశలు రేపుతోంది.

rtc driving schools
ఆర్టీసీ భారీ వాహనాల డ్రైవింగ్‌ శిక్షణ
author img

By

Published : Nov 10, 2020, 11:10 PM IST

Updated : Nov 11, 2020, 3:40 PM IST

ఆర్టీసీ భారీ వాహనాల డ్రైవింగ్‌ శిక్షణ

రాష్ట్రంలోని 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఆర్టీసీ ప్రారంభించిన భారీ వాహనాల డ్రైవింగ్‌ శిక్షణ నిరుద్యోగుల్లో ఆశలు రేపుతోంది. 20 ఏళ్ల వయసు, 8 తరగతి ఉత్తీర్ణత, ఏడాది వ్యవధి కారు లైసెన్సు కలిగిన వారికి కల్పించిన ఈ అవకాశాన్ని వినియోగించుకొనేందుకు పెద్ద సంఖ్యలో యువత ఆసక్తి చూపుతోంది. నెలన్నర పాటు జరిగే శిక్షణకు 23 వేల రూపాయలు ఫీజుగా నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా బస్ డిపోల్లో దరఖాస్తు చేసుకుంటున్న వారిలో బ్యాచ్‌కు 16 మంది చొప్పున ఎంపిక చేసి ఆర్టీసీ అధికారులు అత్యుత్తమ శిక్షణ ఇస్తున్నారు.

సుశిక్షితులైన సిబ్బందితో శిక్షణ

విశాలమైన తరగతి గదులు, సుశిక్షితులైన సిబ్బందితో పాటు బస్సును డ్రైవింగ్‌ శిక్షణ కోసం అందుబాటులో ఉంచారు. 32 రోజుల పాటు జరిగే శిక్షణలో 16 రోజుల పాటు బోధనా తరగతులు, మరో 16 రోజులు శిక్షణ ఇస్తారు. రవాణా శాఖకు చెందిన సీనియర్ అధికారులు, విశేష అనుభవం కలిగిన డ్రైవర్లతో పాఠాలు బోధిస్తారు. ట్రాఫిక్ నిబంధనలు, హెచ్చరిక బోర్డుల వివరాలు, జాగ్రత్తలు, ఇంధన పొదుపు విధానాలు, వాహనాల మరమ్మతులు, ఆరోగ్య పరిరక్షణ ఇలా సవివరంగా తెలియజేస్తారు.

లైసెన్సు మంజూరుకూ తోడ్పాటు

శిక్షణ అనంతరం నిర్ణీత పరీక్షల్లో పాసైన వారికి ధ్రువపత్రం జారీ చేస్తారు. హెవీ మోటార్ వెహికల్‌ లైసెన్సు మంజూరుకు ఆర్టీసీ అధికారులే చర్యలు తీసుకుంటారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఆయా కులాల కార్పొరేషన్లే ఫీజు చెల్లిస్తున్నాయి. భారీ వాహనాల డ్రైవింగ్‌ శిక్షణతో స్థిరమైన ఆదాయంతో కూడిన ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఆర్టీసీ డ్రైవర్ల నియామకాల్లోనూ ప్రాధాన్యం ఇస్తామని ప్రకటించినందున ఇక్కడ శిక్షణకు పోటీ నెలకొంది.

ఇవీ చూడండి...

ఈ ఏడాది ఇంజినీరింగ్‌ సీట్లలో భారీ కోత పడే అవకాశం!

Last Updated : Nov 11, 2020, 3:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.