నెల్లూరు కబాడీపాలెంలోని ఎస్సీ కమ్యూనిటీ హాలులో.. గ్రామ సచివాలయం ఏర్పాటు చేయటంపై దాఖలైన పిటిషన్ మీద.. నేడు హైకోర్టు విచారణ చేసింది. ఈ విషయంపై నెల్లూరు వాసి మేడూరి ప్రశాంత్ కుమార్ పిటిషన్ దాఖలు చేశారు. కమ్యూనిటీ హాలులో కార్యాలయం ఎలా ఏర్పాటు చేస్తారని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
ఎస్సీల కార్యకలాపాల కోసం కట్టిన భవనంలో కార్యాలయం నిర్వహించటం ఏంటని విమర్శించింది. తక్షణమే కార్యాలయాన్ని అక్కడి నుంచి తరలించాలని ప్రభుత్వానికి ఆదేశించింది. కార్యాలయం తరలింపునకు మున్సిపల్ కమిషనర్ తరపు న్యాయవాది గడువు కోరగా.. 4 వారాల్లో వేరేచోట ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: