ETV Bharat / city

చంద్రబాబు భద్రత... హైకోర్టు తీర్పు... తెదేపా హర్షం - చంద్రబాబు

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు భద్రతపై హైకోర్టు తీర్పును తెలుగుదేశం స్వాగతించింది. భద్రత పునరుద్ధరించాలని ఎన్నిసార్లు మొరపెట్టినా అవాస్తవ లెక్కలు చెప్పిన సర్కార్ కు న్యాయస్థానం తీర్పు చెంపచెట్టులాంటిదని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు. ఇకనైనా కక్షసాధింపు చర్యలు మాని మాజీముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబుకు తగినంత భద్రతను కోర్టు ఆదేశాల మేరకు కొనసాగించాలని హితవు పలికారు.

చంద్రబాబు భద్రత
author img

By

Published : Aug 15, 2019, 5:45 AM IST

చంద్రబాబు భద్రత

చంద్రబాబు భద్రతపై కోర్టుకు కూడా ప్రభుత్వం అవాస్తవాలు చెప్పి దొరికిపోయిందని తెలుగుదేశం నేతలు విమర్శించారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా భద్రత తగ్గించి... ఇప్పుడు పునరుద్ధరించే పరిస్థితి తెచ్చుకున్నారన్నారు. సర్కారు పేర్కొన్న అంకెలకు... వాస్తవ లెక్కలకు పొంతన లేదన్నారు. చంద్రబాబుకు 58మంది బదులు 74మందితో భద్రత కల్పిస్తున్నామని సర్కారు న్యాయస్థానానికి నివేదించింది. 2014కు ముందు చంద్రబాబుకు ఒక ఏఎస్పీ, డీఎస్పీ, ఇద్దరు ముఖ్య భద్రతాధికారులు(సీఎస్​వోలు)గా ఉండేవారు. ముగ్గురు ఇన్​స్పెక్టర్లతో 3బృందాలు ఉండేవి.

సబ్ ఇన్​స్పెక్టర్లు ముగ్గురు, 9మంది కానిస్టేబుళ్లు ఉండేవారు. దీనికి అదనంగా ఇంటి భద్రతలో భాగంగా ఇద్దరు ఎస్సైలు, 8మంది పీసీలు ఉండేవారు. జిల్లా ఎస్కార్ట్​లో భాగంగా ఒక హెడ్ కానిస్టేబుల్, ముగ్గురు కానిస్టేబుళ్లు, కాన్వాయ్​లో 8వాహనాలుండేవి. ఒక పైలెట్ వాహనంతో పాటు 2బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు, ‍ఒక జామర్ వాహనం, ఎన్ఎస్జీ వాహనాలు రెండు ఉండేవి. మొత్తం 17మంది కాన్వాయ్ ప్రయాణంలో ఉండేవారు. ఇంటి భద్రత బృందాలు రెండు షిఫ్టుల్లోను... ప్రయాణ భద్రత దళాలు 3షిఫ్టుల్లోను కలిపి ఒక కంపెనీగా మొత్తం 66 మంది గార్డులు ఉండేవారు.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కార్యాలయమైన ఎన్టీఆర్ భవన్​కు ఇద్దరు గార్టులుండేవారు. క్లోజ్ మానిటర్ ప్రొటెక్షన్ బృందం సీపీటీ కూడా ఉండేది. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత చంద్రబాబు కుటుంబ సభ్యులతో విదేశాలకు వెళ్లి వచ్చే సరికి... భద్రత కుదించారు. దీనిపై చంద్రబాబు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తాజాగా న్యాయస్థానం ప్రభుత్వం కల్పిస్తున్న భద్రతకు భిన్నంగా తీర్పు వెల్లడించడం పట్ల తెదేపా నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భద్రతలో ప్రధానమైన సీపీటీ బృందం తిరిగి ఇవ్వాలని ఆదేశించడాన్ని నేతలు స్వాగతిస్తున్నారు.

ఇదీ చదవండీ...

మువ్వన్నెల పతాకాన్ని ఆవిష్కరించనున్న జగన్

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.