ETV Bharat / city

ఒడిశా సీఎంతో చర్చలను ఖరారు చేయండి: సీఎం జగన్

వరద సమయంలోనూ పోలవరం పనులు చేసుకునేందుకు ప్రణాళిక రూపొందించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. స్పిల్‌వే పిల్లర్స్‌ పనులు సెప్టెంబర్‌ 15 కల్లా పూర్తవుతాయని అధికారులు సీఎంకు వివరించారు. పునరావాస కార్యక్రమాల్లో నాణ్యతపై దృష్టిపెట్టాలని సీఎం స్పష్టం చేశారు.

Finalize talks with Odisha CM: CM Jagan
ఒడిశా సీఎంతో చర్చలను ఖరారు చేయండి: సీఎం జగన్
author img

By

Published : Aug 12, 2020, 8:50 PM IST

Updated : Aug 13, 2020, 6:53 AM IST

వంశధారపై నిర్మించాల్సిన నేరడి బ్యారేజీకి సంబంధించి ఒడిశా ముఖ్యమంత్రితో చర్చలకు ఏర్పాట్లు చేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు. ఇప్పటికే ఈ విషయంపై ఒడిశా సీఎంకు ఆయన లేఖ రాసిన విషయాన్ని అధికారులు ప్రస్తావించారు. ఆ సమాధానం కోసం ఎదురుచూడకుండా చర్చలను ఖరారు చేయాలని అధికారులకు జగన్‌ సూచించారు. నేరడి బ్యారేజీ నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. జంఝావతి నదిపై నిర్మించాల్సిన ప్రాజెక్టుకు సంబంధించి ఒడిశాతో ఉన్న సమస్యల పరిష్కారంపైనా దృష్టి పెట్టాలన్నారు. జలవనరుల ప్రాజెక్టుల పురోగతిపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం సాయంత్రం అధికారులతో సీఎం సమీక్షించారు. గాలేరు నగరి, హంద్రీనీవా పథకాలను అనుసంధానించే ఎత్తిపోతల పథకం పనుల్ని తక్షణమే చేపట్టాలని ఆదేశించారు. పులివెందుల సూక్ష్మ నీటి పథకం పనులు తక్షణమే చేపట్టేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు.

తోటపల్లి ప్రాజెక్టుతో పాటు విజయనగరం జిల్లాలో ఇతర ప్రాజెక్టులకూ కలిపి రూ.500 కోట్లు ఖర్చు చేస్తే మొత్తం పూర్తి అవుతాయని సీఎం పేర్కొన్నారు. వాటి కోసం ప్రతి నెలా కొంత మొత్తం నిధులు కేటాయించాలని చెప్పారు. తొలుత పూర్తి చేయాలనుకున్న వెలిగొండ, అవుకు టన్నెల్‌, నెల్లూరు, సంగం బ్యారేజీ, కొరిశపాడు ఎత్తిపోతల, వంశధార, నాగావళి అనుసంధానం పనులు తదితరాలపై ఈ సందర్భంగా సీఎం సమీక్ష చేపట్టారు. కరోనా కారణంగా కూలీలు అందుబాటులో లేక పనులకు కొంత ఇబ్బంది కలిగిందని అధికారులు తెలిపారు.

టన్నెల్‌ పనుల్ని వేగంగా చేయాలి

వెలిగొండ సొరంగం పనులు నవంబరు ఆఖరుకు పూర్తవుతాయని, డిసెంబరు మొదటి వారంలో నీరు విడుదలకు సిద్ధం చేస్తున్నామని అధికారులు వివరించారు. అవుకు టన్నెల్‌-2 పనులు అక్టోబరు నాటికి పూర్తి చేస్తామని, అదనంగా మరో 10 వేల క్యూసెక్కుల నీరు వెళ్లేలా ఏర్పాట్లు సాగుతున్నాయని చెప్పారు. రెండో టన్నెల్‌ పనుల్నీ వేగంగా పూర్తి చేయాలని సీఎం చెప్పారు. నెల్లూరు బ్యారేజీలో మొత్తం మీద 87 శాతం పనులు పూర్తయ్యాయని చెప్పారు. సంగం బ్యారేజీ నవంబరు నాటికి పూర్తి అవుతుందని అధికారులు తెలిపారు. వంశధార-నాగావళి అనుసంధానం పనుల తీరుపైనా జగన్‌ సమీక్షించారు. డిసెంబరు చివరి నాటికి ఈ పనులు పూర్తి అవుతాయన్న అధికారులు వంశధార రెండో దశ పనులు మార్చి నాటికి చేస్తామన్నారు.

పోలవరంలో 51 మీటర్ల ఎత్తుకు స్తంభాలు

పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే లో మొత్తం పియర్లు (స్తంభాలు) అన్నీ 51 మీటర్ల ఎత్తుకు నిర్మించినట్లు అధికారులు సీఎంకు తెలిపారు. ఈ ప్రభుత్వం వచ్చేసరికి పియర్లు సగటున 28 మీటర్ల ఎత్తులో ఉన్నాయన్నారు. సెప్టెంబరు కల్లా మొత్తం స్తంభాల నిర్మాణం పూర్తవుతుందన్నారు. వర్షాకాలంలోనూ పనులు జరిగేలా ప్రణాళిక రూపొందించామన్నారు. ఎడమ కాలువ నిర్మాణాన్నీ వేగవంతం చేస్తామని చెప్పారు. పోలవరం పునరావాస పనులపై దృష్టి సారించాలని సీఎం సూచించారు. గండికోటలో 26.85 టీఎంసీల నీటి నిల్వకు అవసరమైన పునరావాస పనులు పూర్తి చేయాలన్నారు. చిత్రావతిలో 10 టీఎంసీలు నిల్వ చేయాలన్నారు. గండికోట-పైడిపాలెం ఎత్తిపోతల ఉన్నతీకరణను చేపట్టాలన్నారు. జొలదరాశి, రాజోలి జలాశయాల ప్రాజెక్టులు జ్యుడీషియల్‌ సమీక్ష కోసం ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ సమావేశంలో మంత్రి అనిల్‌కుమార్‌, జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌, ఈఎన్‌సీ నారాయణరెడ్డి, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ మళ్లీ వాయిదా

Last Updated : Aug 13, 2020, 6:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.