ETV Bharat / city

No Seats In Trains: సొంతూళ్లకు ప్రయాణ కష్టాలు.. రైళ్లలో నిండిపోయిన బెర్తులు

TRAINS RESERVATIONS: సంక్రాంతి పండుగకు రైల్లో సొంతూరు వెళ్దామనుకుంటున్నారా.? టికెట్ రిజర్వేషన్ కోసం ప్రయత్నిస్తున్నారా? మీ ప్రయత్నం విరమించుకోవడం మంచిది. ఎందుకంటే మీ ఊరెళ్లే ఏ రైళ్లోనూ బెర్తులు ఖాళీగా లేవు. హైదరాబాద్ నుంచి ఏపీ వైపు వెళ్లే రైళ్లన్నింటిలోనూ బెర్తులు నిండిపోయాయి. ఆర్టీసీ బస్సుల్లోనూ వేగంగా టికెట్లు బుక్‌ అయిపోతున్నాయి. పండుగ ముందు రోజుల్లో పయనమయ్యే వారంతా ప్రత్యేక బస్సుల్లో 50 శాతం చార్జీ ఎక్కువ చెల్లించి జేబులు ఖాళీ చేసుకోక తప్పదు. ప్రైవేటు బస్సుల్లోనూ టికెట్ రేట్లు పెంచేశారు.

రైళ్లలో నిండిపోయిన బెర్తులు
రైళ్లలో నిండిపోయిన బెర్తులు
author img

By

Published : Dec 25, 2021, 9:18 AM IST

Updated : Dec 25, 2021, 12:06 PM IST

berths full in trains for pongal: సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే వారికి ఈసారీ ప్రయాణ కష్టాలు తప్పేలా లేవు. తక్కువ ఖర్చుతో రైళ్లో ఊరెళదామని ఆశపడితే నిరాశ తప్పదు. హైదరాబాద్ నుంచి ఏపీకు వెళ్లే అన్ని రైళ్లలో పండుగ ముందు 3 రోజుల్లో బెర్తులన్నీ నిండిపోయాయి. అన్ని రైళ్లలో వెయిటింగ్ లిస్టు దర్శనమిస్తోంది. కొన్ని రైళ్లలో కనీసం టికెట్లు బుకింగ్ చేసుకునేందుకూ అవకాశం లేకుండా రిగ్రేట్ వస్తోంది. హైదరాబాద్ నుంచి వచ్చే రైళ్లలో గోదావరి, ఫలక్‌నుమా, చార్మినార్,ఈస్ట్‌కోస్ట్, శాతవాహన, నర్సాపూర్, కృష్ణా, కోణార్క్ ఎక్స్ ప్రెస్ రైళ్లకు ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. వీటన్నింటిలోనూ బెర్తులు ఇప్పటికే నిండిపోయాయి. టికెట్‌ రిజర్వేషన్ చేసుకునేందుకు వచ్చే ప్రయాణికులు నిరాశతో వెనుతిరుగుతున్నారు. విజయవాడ నుంచి పలు జిల్లాలకు వెళ్లే అన్ని రైళ్లలోనూ ఇదే పరిస్ధితి నెలకొంది.

సొంతూళ్లకు ప్రయాణ కష్టాలు...రైళ్లలో నిండిపోయిన బెర్తులు

ఛార్జీలు పెంచేసిన ప్రైవేట్​ ట్రావెల్స్​..

అటు.. సంక్రాంతి రద్దీ దృష్ట్యా ప్రయాణికులను దోచుకునేందుకు ప్రైవేటు ట్రావెల్స్ యాజమానులు సిద్దమవుతున్నారు. పండుగ ముందు 3 రోజుల్లో పలు ప్రాంతాలకు నడిచే బస్సు సర్వీసుల టికెట్ ధరలను డిమాండ్‌ను బట్టి మూడింతలు పెంచేశారు. వీటన్నింటికీ ఆన్ లైన్ రిజర్వేషన్ చేసుకునే సదుపాయం కల్పించారు.

ప్రత్యేక బస్సులు..

రైళ్లలో బెర్తులు లేకపోవడం, ప్రైవేటు బస్సుల్లో టికెట్ల ధరలను భరించలేని వారు ఆర్టీసీ బస్సుల్లో టికెట్లు బుక్‌ చేసుకుంటున్నారు. రద్దీ దృష్ట్యా ప్రయాణికులు సౌకర్యార్థం ఆర్టీసీ 1,266 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. జనవరి 7 నుంచి 17 వ తేదీ వరకు.. ఇవి నడుస్తాయి. ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అదనపు ఛార్జీని వసూలు చేస్తున్నారు. పండుగ రోజుల్లో ప్రయాణ భారం తగ్గించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.

ఇదీ చదవండి:

CJI NV Ramana Tour: ప్రధాన న్యాయమూర్తినయినా.. పొన్నవరం బిడ్డనే: సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ

Last Updated : Dec 25, 2021, 12:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.