తుంగభద్ర పుష్కారాల్లో ఈ-టికెట్ విధానం రద్దు - తుంగభద్ర పుష్కారాల్లో ఈటీకెట్ విధానం
తుంగభద్ర పుష్కరాల్లో ఈ- టికెట్ విధానం అమలుపై ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ప్రతిపక్షాలు, భక్తుల నుంచి తీవ్రమైన విమర్శలు రావటంతో ఈ-టికెట్ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
![తుంగభద్ర పుష్కారాల్లో ఈ-టికెట్ విధానం రద్దు తుంగభద్ర పుష్కారా](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9573829-581-9573829-1605625922251.jpg?imwidth=3840)
కర్నూలు జిల్లాలో తుంగభద్ర పుష్కరాల్లో పాల్గొనే వారికి ఈ- టికెట్ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ వీరపాండియన్ తెలిపారు. ఈనెల 20 నుంచి డిసెంబర్ 1 వరకు తుంగభద్ర పుష్కరాలు జరగనున్నాయి. కరోనా నేపథ్యంలో పుష్కరాల్లో నదీ స్నానాలను నిషేధించారు. కేవలం పిండప్రదానాలు, పూజలు చేసేందుకు మాత్రమే అనుమతి ఇచ్చారు. వీరు కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన వెబ్ సైట్ లో ఈ- టికెట్ విధానంలో స్లాట్ బుక్ చేసుకోవాలని ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై ప్రతిపక్షాలు, భక్తుల నుంచి తీవ్రమైన విమర్శలు రావటంతో... స్లాట్ బుకింగ్ విధానాన్ని రద్దు చేశామని... ఎక్కడైనా పిండప్రదానాలు, పూజలు చేసుకోవచ్చని కలెక్టర్ ప్రకటించారు.
ఇదీ చదవండి