ETV Bharat / city

Purandeswari on Assembly Incident: 'ప్రజలు గమనిస్తున్నారు.. పద్ధతి మార్చుకోండి' - Purandeswari on Assembly Incident

పవిత్రమైన రాష్ట్ర శాసనసభలో మాట్లాడుతోన్న భాష నానాటికీ దిగజారిపోతోందని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు(Purandeswari on Assembly Incident news). జరుగుతున్న ఘటనలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. రాష్ట్రంలో వరదలపైనా ఆమె స్పందించారు. ఇక్కడి పరిస్థితులను అంచనా వేసి ముఖ్యమంత్రి కేంద్రానికి తెలియజేయాల్సి ఉంటుందని.. కానీ, ప్రధాని మోదీనే స్వయంగా జగన్​కు ఫోన్‌ చేసి పరిస్థితులను తెలుసుకున్నారని చెప్పారు.

Daggubati Purandeswari
Daggubati Purandeswari
author img

By

Published : Nov 21, 2021, 3:13 PM IST

ప్రజాసమస్యలపై చర్చ జరగాల్సిన అసెంబ్లీని.. వ్యక్తిగత విమర్శలకు వేదికగా మార్చడం సరికాదని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధేశ్వరి అన్నారు(news). చంద్రబాబు కుటుంబ సభ్యుల వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ వైకాపా నేతలు చేసిన వ్యాఖ్యలపై పురందేశ్వరి మరోసారి స్పందించారు(ycp leaders comments aganist chandrababu news). జరుగుతున్న ఘటనలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని వైకాపా నేతలకు ఆమె సూచించారు. తను, భువనేశ్వరి నైతిక విలువలతో పెరిగామని, విలువల్లో రాజీపడే ప్రసక్తే లేదని అసెంబ్లీ ఘటనపై పురందేశ్వరి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

చంద్రబాబుపై వైకాపా నేతల అనుచిత వ్యాఖ్యలను నందమూరి కుటుంబ సభ్యులు తీవ్రంగా ఖండించారు. శనివారం నందమూరి బాలకృష్ణ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాలయం లాంటి అసెంబ్లీలో మహిళలను కించపరిచేలా మాట్లాడటం ఏంటన్న బాలకృష్ణ మరో సోదరి లోకేశ్వరి.. అహంభావం విడనాడాలని సూచించారు.

రాజకీయాల్లోకి కుటుంబసభ్యులను తీసుకొస్తారా? అని వైకాపా నేతలపై నందమూరి సుహాసిని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భువనేశ్వరి ఏనాడు రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదని అన్నారు. రాజకీయాలు రాజకీయంగానే ఉండాలి గానీ.. కుటుంబ విషయాల జోలికి తీసుకురావటం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. మహిళలకు ఎన్టీఆర్ ఎంతో గౌరవమిచ్చారన్న సుహాసిని.. నిన్న అసెంబ్లీలో జరిగిన ఘటనను అందరూ ఖండించాలని పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి:

తెలంగాణ​ స్పీకర్‌ పోచారం మనవరాలి వివాహం.. హాజరైన జగన్, కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.