తెలంగాణలోని జీహెచ్ఎంసీ పరిధి, శివారులో... కరోనా రోజురోజుకు విజృంభిస్తుండడం వల్ల ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడంలేదు. జంటనగరాల్లో అత్యంత కీలకమైన ప్రజా రవాణా వ్యవస్థ ఎంఎంటీస్ రైళ్లు... 3 నెలల నుంచి షెడ్డులకే పరిమితమయయ్యాయి. ఆగస్టు 9... 2003లో అందుబాటులోకి వచ్చిన ఈ సర్వీసులు.. ఇప్పటి వరకు షెడ్డుకు పరిమితమైన దాఖలాలు లేవు. 50 కిలోమీటర్ల పరిధిలో 29 స్టేషన్ల గుండా... నిత్యం 121 సర్వీసులు నడుస్తూ ఉండేవి. దీర్ఘకాలం ఎంఎంటీఎస్ రైళ్లు... షెడ్డులకే పరిమితం కావటం వల్ల కొన్ని సాంకేతిక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వాటిని రెండు రోజులకు ఒకసారి... సర్వీసింగ్ చేయాల్సి ఉంటుందని ఇంజినీర్లు చెబుతున్నారు. ఇప్పుడు ఎంఎంటీఎస్ రైళ్ల నిర్వహణకు సంబంధించి... ఈటీవీ భారత్ ప్రతినిధి అందిస్తున్న వివరాలు..!
ఇవీ చూడండి: